ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)సుకుమార్(sukumar) కి మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికి తెలుసు. కేవలం హీరో, దర్శకుడు అనే టాగ్ లైన్ దగ్గరే ఆ రిలేషన్ ఆగలేదు. నేను పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతున్నానంటే అందుకు సుకుమారే కారణం అని బన్నీ చెప్పటం, సుక్కు కన్నీళ్లు పెట్టుకోవడం కూడా జరిగింది.దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆ మధ్యన ఉన్న బాండింగ్ ఇద్దరి. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న న్యూస్ అందుకు భిన్నంగా ఉంది.
బన్నీ,సుక్కు కాంబో లో రాబోతున్న మూవీ పుష్ప 2(పుష్ప 2).పుష్ప పార్ట్ 1 హిట్ కావడంతో పార్ట్ టూ పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.పైగా షూటింగ్ స్టార్టింగ్ రోజే ఆగస్ట్ 15 అని కూడా అనౌన్స్ చేసారు. అందుకు తగ్గట్టే శరవేగంగా షూటింగ్ ని కూడా జరుపుకుంది. పైగా టైటిల్ సాంగ్, బన్నీ ని లేడీ గెటప్ లో రిలీజ్ చేసిన టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో ఆగస్ట్ 15 కోసం అందరు రీగర్ గా వెయిట్ చేసారు. కానీ మూవీ ఆగస్ట్ 15 నుంచి డిసెంబర్ 6కి వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం సుకుమార్ అనే వార్తలు వస్తున్నాయి .రేపు ఉదయం షూటింగ్ అనంగా క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు. బాలన్స్ షూట్ అయితే ఇంకో ముప్పై రోజులు మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. ప్రస్థుతానికి అయితే షూటింగ్ జరగడంలేదు. సుక్కు కి ఫీవర్ రావడంతో బ్రేక్ పడిందని అంటున్నారు. కాకపోతే ఆ వార్తలు ఎంత వరకు నిజమో తెలియదు. ఇక ఈ తరహా పని తీరుతో బన్నీ విసిగిపోయాడనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతున్నాయి. పైగా మూడున్నర ఏళ్లుగా వేరే సినిమా జోలికి వెళ్లకుండా పుష్ప తోనే ఉన్నాడు.దీంతో అట్లీ సినిమాని కూడా బన్నీ వదులుకోవాల్సిన పరిస్థితి. కానీ ఏమి చెయ్యలేక ఊరుకున్నాడు.
ఇక ఇప్పుడు ఇంకో బెంగ కూడా బన్నీ కి పట్టుకుందని తెలుస్తుంది. డిసెంబర్ మొదటి వారంలోనే మూవీ రిలీజ్ కాబట్టి ముప్పై రోజులు పాటు కంటిన్యూ గా షూట్ జరగాలి. అంటే ఆగస్ట్ నెల చివరి కల్ల కంప్లీట్ చెయ్యాలి.ఎందుకంటే ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ ఎంత లేదన్న మూడు నెలల సమయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి షూట్ ఇప్పటి నుంచే ఫాస్ట్ గా జరగాలి. ఇందు కోసం డే అండ్ నైట్ షూట్ చెయ్యడానికి కూడా బన్నీ రెడీ గా ఉన్నాడు. కానీ సుక్కు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనపడటం లేదనే టాక్ వినపడుతుంది. ఈ విషయంపై సుక్కు తో బన్నీ గట్టిగా చెప్పలేక పోతున్నాడని, సుక్కు ఏమో షూట్ ని స్టార్ట్ చేయడం లేదని అంటున్నారు. పాపం ఈ మధ్యలో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. పార్ట్ వన్ ని నిర్మించిన నవీన్ ఎర్నేని, రవి శంకర్ లే పార్టు టూ ని కూడా మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers)ద్వారా నిర్మించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ ఎంటైర్ న్యూస్ పై ఇది బన్నీ చేసుకున్న స్వయం కృతాపరాధమే కామెంట్స్ వస్తున్నాయి. ఎవరి ఉద్దేశ్యాలు వాళ్ళవి మరి.