తాజాగా సంచలనం సృష్టిస్తున్న రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో రకరకాల ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. వీరిద్దరి వ్యవహారంలో మాల్వీ మల్హోత్రా, మయాంక్ మల్హోత్రా, మస్తాన్ సాయి.. ఇలా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఈ కేసుపై విచారణ జరిపిన నార్సింగి పోలీసులు హీరో రాజ్ తరుణ్‌కి నోటీసులు జారీ చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనతో 11 ఏళ్ల సహజీవనం చేసిన రాజ్ తరుణ్ ఇప్పుడు ఓ హీరోయిన్ మోజులో పడి తనని వదిలేశాడని, తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
రాజ్‌తరుణ్, లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ మూవీ చూస్తున్న ఫీలింగ్‌ని కలిగిస్తోంది. ఆ పాలసీ తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు రాజ్‌తరుణ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. కొత్త న్యాయచట్టం బీఎన్‌ఎస్‌ఎస్ 45 కింద రాజ్‌తరుణ్‌కు నోటీసులు ఇచ్చారు. రాజ్‌తరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఏ 1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వి మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రని పేర్కొన్నారు. రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసినందుకు తనను చంపేస్తానని బెదిరించారని లావణ్య ఆధారంగా వారిపై ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.