ఈమధ్య మీడియా, సోషల్ మీడియా, నెటిజన్లు చాలా బిజీ అయిపోయారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదం వెలుగులోకి వస్తూనే ఉంది. ఊపిరి సలపనంతగా ఒకదాని వెంట మరొకటి వస్తూ ఉండటంతో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది డిసైడ్ చేయడం అందరికీ కష్టంగా మారింది. అయినా ఎవరికి తోచిన స్టేట్‌మెంట్ వారు ఇస్తున్నారు. తాజాగా విజయ్‌సాయిరెడ్డి, శాంతి, మదన్‌మోహన్‌ల ఇష్యూ పెద్ద బ్రేకింగ్‌గా మారింది. ఎక్కడా దీని గురించి చర్చించుకుంటున్నారు. ఏ మీడియా సంస్థ అయినా ఈ ఇష్యూ మీదే డిబేట్ పెడుతోంది. అయినా ఇప్పటికీ నిజానిజాలు బయట పడలేదు. ఎవరి వెర్షన్ వారు చెబుతున్నారు, ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు.
దేవదాయ శాఖ కమిషనర్ శాంతి, విజయసాయిరెడ్డి మీద మీడియాలో లెక్కకు మించిన వార్తలు వస్తున్నాయి. శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రెవరు అనేదే పాయింట్. ఆమె బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అని మదన్ మోహన్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. దాన్ని ఖండిరచడం, మదన్‌మోహన్‌తో విడాకులు ఎప్పుడో తీసుకున్నానని చెప్పడంతో ఈ విషయంలో గందరగోళం ఏర్పడింది. మరో పక్క తనపై తప్పుడు కథనాలు రాస్తున్న వారికి విజయ్‌సాయిరెడ్డి తీవ్రమైన పదజాలంతో వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ స్పందించలేదు. ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్య చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్‌కౌర్ ప్రస్తుతం ఇష్యూని తీసుకొని దానిపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది.
ట్విట్టర్‌లో పూనమ్‌కౌర్ సూచన ‘టివి ఛానల్ బ్లాక్ మెయిలింగ్ ఇన్‌స్యులేషన్‌లుగా మారాయి. వారికి అందిన సమాచారం మాత్రమే నిజమైందని, దాన్ని ప్రజలు నమ్మాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డిగారి ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. గిరిజన మహిళకు అండగా నిలబడి నిజం నిగ్గు తేలుస్తానని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇలాంటి సందర్భాల్లో మహిళలు ఎంతో ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం కార్చే కన్నీరు వాళ్ళకు విజయాన్ని చేకూరుస్తుంది. అందుకే అధైర్య పడొద్దు’ అని ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్‌పై ఓ నెటిజన్’ సూచిస్తూ ‘ఈ ఇష్యూ గురించి అవగాహన లేకుండా, ఇందులోని నిజానిజాలు ఏమిటో తెలుసుకోకుండా ఒకరినిడిగా నమ్మడం, వారిని సపోర్ట్ చేయడం సరైనది కాదు. కులం, స్త్రీపురుషులు అనే తేడా లేకుండా ఎవరు తప్పు చేసినా అది తప్పే అని చెప్పాలి’ అంటూ ట్వీట్ చేశాడు.
ఆ ట్వీట్‌పై స్పందించిన పూనమ్ ‘నా మీద ఎప్పుడూ ఇలాంటి ఫేక్ స్టోరీలే వస్తుంటాయి. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలోని బాధేమిటో మీకు తెలీదు. అది మీ అనుభవంలోకి వస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి దానిలో నేను నిజం చెప్పినా, నిజాయితీగా ఉన్నవారి వైపు మాట్లాడినా నన్ను చంపేస్తారు. అది నా చావుకు కారణమవుతుంది. అయినా ఫర్వాలేదు. పోరాడతాను’ అని సమాధానమిచ్చింది.