సినిమాకి సంబంధించి ఎవరెవరికి అభిమానులు ఉంటారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్, క్యారక్టర్ ఆర్టిస్ట్ ఇంకా చెప్పాలంటే కామెడీ నటులకి ఉంటారు. కానీ నిర్మాత కి కూడా అభిమానులుంటారని నిరూపించిన చాలా మంది వ్యక్తుల్లో అశ్వనీదత్(awani dutt)కూడా ఒకరు. ఎంత పెద్ద హీరో అభిమాని అయినా కూడా తమ హీరో సినిమాకి దత్తు గారే నిర్మాతగా ఉండాలని కోరుకునే రికార్డు ఆయన సొంతం. అంత భారీగా ప్రాణం పెట్టి మరి నిర్మిస్తారు. ప్రతి ఫ్రేమ్ కూడా ఇది దత్తు గారి సినిమా అని చెప్తూనే ఉంటుంది. అలాంటి వ్యక్తి లేటెస్ట్ గా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఏం మాట్లాడాడో చూద్దాం.
ప్రభాస్(ప్రభాస్)రీసెంట్ హిట్ కల్కి 2898 ఏడి( kalki 2898 ad)జూన్ 27న వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అయ్యింది. అన్ని చోట్ల కూడా పాజిటివ్ టాక్ తో కలెక్షన్ రికార్డులతో ముందుకు దూసుకుపోతుంది. ఇందుకు నిదర్శనమే వెయ్యి కోట్ల మార్క్. దీంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. కల్కి ని వైజయంతి మూవీస్ పై అశ్వనీదత్ నిర్మించిన విషయం అందరికి తెలిసిందే. రీసెంట్ గా ఆయన మాట్లాడుతు ప్రభాస్ ని నమ్ముకునే మూవీ స్టార్ట్ చేసాం. మొత్తం ఆయనే నడిపిస్తారు అనుకుని, ఆయన మీదే అప్పజెప్పాం. ఇప్పుడు రిజల్ట్స్ కూడా మా నమ్మకానికి అనుకూలంగా వచ్చిందని చెప్పాడు ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఎంతో సుదీర్ఘ చరిత్ర కల్గిన ఒక భారీ నిర్మాత ఎలాంటి భేషజాలకు పోకుండా ఆ విధంగా చెప్పడం ఆయన గొప్ప తనానికి నిదర్శనం అని అంటున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు విన్న ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆ కట్ అవుట్ ని వాడుకున్న వాళ్లకి వాడుకున్నంత అని మెసేజ్ చేస్తున్నారు.
ఇక కల్కి విజయం పై ఇండస్ట్రీలో ఇంకో ఆసక్తి కరమైన చర్చ కూడా జరుగుతుంది. అశ్వనీ దత్ నిర్మించిన సినిమాలు హిట్ అవ్వడం ప్రేక్షకులకి చాలా ముఖ్యం. ఎన్ని హిట్ అయితే అన్ని భారీ సినిమాలు పురుడు పూసుకొని ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తాయని చెప్తున్నారు. సినిమా ద్వారా వచ్చే డబ్బుల్ని తిరిగి సినిమాలకే ఉపయోగించే ప్రొడ్యూసర్ అనే విషయాన్నీ కూడా గుర్తు చేస్తున్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి తో ఎన్నో భారీ హిట్ లని నిర్మించాడు. జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర కి దత్తు గారే నిర్మాత.