గత కొన్ని రోజులుగా రాజ్‌తరుణ్, లావణ్యల వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతూ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాల్వి మల్హోత్రా పాత్ర కూడా ఉందని, రాజ్‌తరుణ్ ఆమెతో సహజీవనంలో ఉండడం వల్లే తనని పట్టించుకోవడం లేదని, అందుకే తనని వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తనకు, మాల్వీకి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, కేవలం ఆమె తన సహనటి మాత్రమేనని ఇన్నాళ్ళూ చెప్తూ వచ్చాడు రాజ్ తరుణ్. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్’కి నోటీసులు పంపించడం కూడా జరిగింది. కానీ, తను షూటింగులతో ప్రస్తుతం ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని చెబుతున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రాలకు సంబంధించిన వాట్‌సాప్ చాట్‌ను లీక్ చేసింది లావణ్య. ఆ చాట్‌లో రాజ్‌తరుణ్.. మాల్వీకి లవ్ ప్రపోజ్ చేయడం, ఆమె వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే ఇద్దరూ కలిసి ఇతర రాష్ట్రాల్లోని వివిధ పట్టణాల్లోని హోటల్స్‌లో గడిపినట్లు కూడా ఆ చాట్‌లో వెల్లడైంది. ప్రతిరోజూ ఒకరి ప్రోగ్రామ్‌లో ఒకరు తమ చాట్స్ ద్వారా పంచుకునేవారని కూడా అందులో తెలిసింది. ఇప్పటివరకు తనకు ఏమీ తెలియదంటూ చెప్పుకొచ్చిన రాజ్ తరుణ్.. ఇప్పుడు లీకైన వాట్సాప్ చాట్‌పై ఎలా స్పందించాడో చూడాలి.