ఫ్యాక్షన్ కి సంబంధించిన సినిమాల్లో చాలా వరకు ఒక సీన్ రిపీట్ అవుతుంది. హీరోకి తన ప్రాంతంలో బాగాపేరు, డబ్బు, పలుకుబడి ఉంటుంది. కానీ ఎవరు లేని ఒక అనాధగా వేరే ప్రాంతంలో సాధారణ వ్యక్తిగా బతుకుతాడు. ఆ తర్వాత ఎవరో ఒకరు వచ్చి హీరోని గుర్తు పడతాడు. సార్ మీరు ఇక్కడేంటని అంటాడు. అప్పుడు హీరో చాలా దీనంగా ఎవరకి చెప్పకు అని తల ఊపుతాడు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)పరిస్థితి కూడా ఇదే. ప్రెజంట్ ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలని చూసి, సార్ మీరేంటి ఇలాంటి సినిమాలని తెరకెక్కించడం ఏంటని అడిగితే వర్మ కూడా మౌనంగా తలనిపించాల్సిన ఏదో ఒక వైపుకి ఊపందుకున్న పరిస్థితి. దీనికంతటికి కారణం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడు(tirumula tirupati venkateswarudu)అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. పూర్తి విషయం చూద్దాం.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగు సినిమాకి సరికొత్త టేకింగ్ ని పరిచయం చేసి, 24 క్రాఫ్ట్స్ కి ఉన్న రూల్స్ ని మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. హిందీ చిత్ర సీమకి కూడా ఇదే రూల్ అప్లై చేసాడు. అంతే కాకుండా ఆయా సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచి కొన్ని సంవత్సరాల ట్రెండ్ సెట్స్ కూడా నిలిచాయి. శివ తో మొదలైన జైత్రయాత్ర క్షణం క్షణం, అంతం, ద్రోహి,రాత్, రంగీలా, గాయం, అనగనగ ఒక రోజు, దెయ్యం, దౌడ్, సత్య, కంపెనీ, సర్కార్, ఆగ్, రక్త చరిత్ర, బెజవాడ, కిల్ వీరప్పన్ ఇలా ఎన్నో. ఆయా చిత్రాల టేకింగ్, క్యారెక్టర్ డిజైన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక ఆ లిస్ట్ లో వచ్చిన గోవిందా గోవిందా సినిమా ద్వారానే వర్మ సినీ స్టార్ట్ అయ్యిందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. వర్మ దర్శకత్వంలోనే 1994లో రిలీజ్ అయ్యింది. నాగార్జున(nagarjuna)శ్రీదేవి(sridevi)జంట కాగా కథ మొత్తం తిరుమల కొండ మీద ఉన్న వేంకటేశ్వర స్వామి విగ్రహం దొంగతనం చెయ్యడం చుట్టు తిరుగుతుంది. అప్పట్లో ఈ కథాంశం పెద్ద సంచలనమే సృష్టించింది. దొంగలు స్వామి విగ్రహాన్ని దొంగిలించడానికి గర్భ గుడిలోకి వస్తారు. ముందుగానే భక్తులకి, స్టాఫ్ కి పోలీసులకి మత్తు ని ఇచ్చే పొగతో పడిపోయేలా చేసి విగ్రహాన్ని దొంగతనం చేస్తారు.టెంపుల్ సెట్ లో ఆ సీన్ షూట్ జరిగింది.
కానీ తిరుమల కొండ పై గర్భ గుడి లో ఉన్న స్వామి విగ్రహమనేదే దర్శకుడు ఉద్దేశ్యం. ఈ కాన్సెప్టే వర్మ పతనానికి బీజం వేసిందని అంటున్నారు. పైగా దొంగతనం చేసేటపుడు వేంకటేశ్వర స్వామి విగ్రహం పైకి ఎక్కుతారని సెన్సార్ లో కట్ అయ్యిందనే వాదనలు కూడా వస్తున్నాయి. యూనిట్ లో చాలా మంది వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్ళద్దని వర్మ కి హితవు కూడా చెప్పారంట. అయినా సరే లెక్క చెయ్యకుండా ప్రదర్శించి అనుభవిస్తున్నాడని అంటారు. అందుకు సాక్ష్యమే ప్రస్తుత వర్మ సినీ, జీవిత పయనం. కాకపోతే ఇప్పుడున్న లైఫ్ చాలా గొప్పదని వర్మ అనుకుంటున్నాడు. వర్మ కి తెలియనిది ఏంటంటే తన క్రియేటివిటి మొత్తం తనకే తెలియకుండా ఏటో వెళ్లిపోయింది. గోవిందా గోవిందా ని వైజయంతి మూవీస్ పై అశ్వనీ దత్ నిర్మించాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత రీసెంట్ గా కల్కి రూపంలో ఆయనకు హిట్ వచ్చింది.