సినిమాకి ఎంతటి శక్తి ఉందో పవన్ నిరూపించిన వాళ్లల్లో పవర్ స్టార్ కళ్యాణ్(pawan kalyan)కూడా ఒకడు. సినిమా వల్లనే ఈ రోజు పవన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఉన్నారు. ఈ విషయం పవన్ కి కూడా తెలుసు.ఇక తాజాగా కొన్ని రోజుల క్రితం పవన్ ప్రాణాలకి ప్రమాదం ఉందని కేంద్ర ఇంటిలెజిన్స్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఆయన అభిమానులు కలవరపాటుకి సిద్ధమయ్యారు. కానీ వాళ్ళు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన పనిలేదని చెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
రీసెంట్ గా పవన్ సింగపూర్ వెళ్లిన విషయం తెలిసిందే. తన భార్య అనా లెజినోవా సింగపూర్ లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఈ పేజీకి పవన్ కూడా హాజరయ్యారు. లెజినోవా పట్టా తీసుకోవడానికి వెళ్తుంటే ఆమె వెనకాలే కూడా వెళ్ళాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ఆ తర్వాత ముగించిన పవన్ ఇండియాలో అడుగుపెట్టాడు.అలా అడుగుపెట్టాడో లేదో పెద్ద మొత్తంలో సెక్యూరిటీ కనిపించింది. పోలీసులతో పాటు కమాండోస్ పెద్ద గన్నులతో పవన్ కి భద్రతగా కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచిందనే విషయం కూడా అర్ధమవుతుంది.
సినిమాల పరంగా చూసుకుంటే పవన్ లిస్ట్ లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి ఉన్నారు. ఈ మూడు కూడా కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. అభిమానులైతే మూడు సినిమాల కోసం ఎంతో ఆశగా ఉన్నారు.ఎందుకంటే ఆ మూడు కూడా వేటికవే డిఫరెంట్ స్టోరీస్.ఇక సోషల్ మీడియాకి పని కల్పించకుండా కొన్ని నెలల దాకా షూటింగ్ లో పాల్గొనని పవనే స్వయంగా చెప్పాడు. కాకపోతే ఏ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడనే క్యూరియాసిటీ ఉంది. సినీ ఇంటిలిజెన్స్ వర్గాల ప్రకారం హరిహరవీరమల్లు పవన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనే వార్తలు వస్తున్నాయి.