పేరుకే సిద్దు జొన్నలగడ్డ(siddhu jonnalagadda)డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల హృదయాల్లో టిల్లు మావగా నిలిచిపోయాడు. లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం టిల్లు క్యూబ్ కి కూడా ముహూర్తం నిర్ణయించే పనిలో ఉన్నాడు.తాజాగా ఆయన మెగాబ్రదర్ నాగబాబు కూతురు నీహారిక (నిహారిక)గురించి చేసిన వ్యాఖ్యలు టూ డే టాక్ ఆఫ్ ది డే గా నిలిచాయి.
కమిటీ కురోళ్ళు..సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల,ఈశ్వర్ రాచి రాజు, త్రినాద్ వర్మ, టీనా శ్రావ్య, ప్రసాద్ బెహ్రా ముఖ్య పాత్రల్లో చేసారు. జయలక్ష్మి ఆడపాక తో కలిసి నీహారిక నిర్మించింది. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. టిల్లు నే చీఫ్ గెస్ట్ గా హాజరయ్యి రిలీజ్ చేసాడు.ఈ సందర్భంగా టిల్లు మాట్లాడటం కొత్త వాళ్ళు అయినా కూడా ఏ మాత్రం ఆలోచించకుండా విభిన్నమైన సినిమాని నిర్మించి మెచ్చుకోవాలి.ఓ వైపు వ్యాఖ్యాతగా ఉంటూనే మరో వైపు సినిమాని నిర్మించడం అంత సులభం కాదు. ఆమెలో ఒక వ్యాపారవేత్తని కూడా చూస్తున్నానని చెప్పాడు.
అదే విధంగా ప్రస్తుత తెలుగు సినిమాపై కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. తెలుగు సినిమా ఇప్పుడు మంచి స్థాయిలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.తక్కువ బడ్జట్ తో నిర్మితమైన చిత్రాలను ప్రోత్సహిస్తూ మనం మరింత ఉన్నత శిఖరాలకి వెళ్తున్నామని కూడా చెప్పాడు. ఇక నీహారిక కూడా మాట్లాడుతుంది సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పింది.ఇక ట్రైలర్ ఆసాంతం ఎంతో ఆసక్తిగా ఉండి సినిమా మీద అందరిలో అంచనాలు పెంచింది. యదు వంశీ(yadhu vamsi)దర్శకుడు.పర్లేదని అనిపించాడు. ఎడిటింగ్ అండ్ ఫోటో గ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు ఇలాంటి సినిమాలని కనపడవు. కాస్టింగే అతి పెద్ద ఎసెట్.