మూవీ : శాకాహారి
నటీనటులు: రంగాయన రఘు, గోపాల్ కృష్ణ దేశ్ పాండే, వినయ్, నిధి హెగ్డే, హారిణి శ్రీకాంత్ భర్తీ
రచన : గిరీష్
ఎడిటింగ్: శశాంక్ నారాయణ
మ్యూజిక్: మయూర్
సినిమాటోగ్రఫీ: విశ్వజిత్ రావు
నిర్మాతలు: రాజేష్ కీలాంభి, రంజినీ ప్రసన్న
దర్శకత్వం: సందీప్ సుంకద్
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్
కథ:
తీర్థ హళ్లి అనే ఓ కొండ ప్రాంతంలో సుబ్బన్న అనే వ్యక్తి ఓ చిన్న హోటల్ ని నడుపుతున్నాడు. పెద్దగా చదువుకోకపోవడం, గతంలో తను ప్రేమించిన అమ్మాయిని వేరే పెళ్లి చేసుకోవడంతో తను ఒంటరిగా ఉంటాడు. చుట్టుప్రక్కల వాళ్ళకి సుబ్బన్న మంచివాడని తెలుసు. అయితే ఓ రోజు అతని హోటల్ కి బుల్లెట్ గాయంతో విజయ్ అనే వ్యక్తి వస్తాడు. దాంతో సుబ్బన్న అతనికి ఆశ్రయం ఇస్తాడు. ఇక మరుసటి రోజు లోకల్ పోలీస్ అయినటువంటి మల్లికార్జున్ (గోపాల్ కృష్ణ దేశ్ పాండే) తన టీమ్ తో కలిసి సుబ్బన్న దగ్గరికి వస్తాడు. విజయ్ అనే హంతకుడు జైలు నుంచి పారిపోయాడనీ, అతను కనిపిస్తే చెప్పమని మల్లికార్జున్ చెబుతాడు .. అతని ఫొటో చూపిస్తాడు. విజయ్ హంతకుడని తెలిసి, సుబ్బన్న కంగారు పడతాడు. ఎవరిని హత్య చేశావని విజయ్ ను అడుగగా.. తన తప్పేమీ లేదంటూ విజయ్ జరిగింది చెప్తాడు. ఇక ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మల్లికార్జున్ కి సుబ్బన్న గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అసలు సుబ్బన్న గతంలో ఏం చేశాడు? విజయ్ కి అతను ఎందుకు ఆశ్రయమిచ్చాడు? పోలీసులు అతన్ని పట్టుకున్నారా లేదా అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ లోని ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా మొదలవ్వడమే కట్టెల పొయ్యిలో ఎవరినో ముక్కలు ముక్కలు చేసి కాలుస్తున్నట్టుగా చూపిస్తారు. దాంతో ఎవరతను? ఎందుకు అంత దారుణంగా చంపారనే క్యూరియాసిటిని రేకెత్తించింది. ఇక అక్కడి నుండి కథ పరుగులు తీస్తుంది. పరిమిత పాత్రలతో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేశాడు.
గ్రిస్పింగ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోబెడుతుంది. చివరి ఇరవై నిమిషాల్లో సినిమా స్వభావమే మారిపోతుంది. అప్పటి వరకు ఆడియన్ ఊహించిందే జరుగుతుందని అనుకుంటారంతా కానీ అసలు కథ అప్పుడే మొదలైందన్నట్టుగా కథనం సాగుతుంది.
రంగాయన రఘు పాత్రతో ప్రేక్షకుడు చివరి వరకు ట్రావెల్ చేస్తాడు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు. అసలు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తున్నంతసేపు టైం తెలియదు. అలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇక కథలో డిస్టబెన్స్ లాంటివి లేకుండా మ్యాజిక్ లని నమ్ముకోకుండా సింపుల్ గా తీసుకెళ్ళాడు. విశ్వజిత్ రావు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మయూర్ మ్యూజిక్ బాగుంది. శశాంక్ నారాయణ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
సుబ్బన్న పాత్రలో రంగాయన రఘు మూవీకి ప్రధాన బలంగా నిలిచాడు. పోలీస్ ఆఫీసర్ మల్లిఖార్జున్ పాత్రలో గోపాల్ కృష్ణ దేశ్ పాండే ఆకట్టుకున్నాడు.
రేటింగ్: 2.75 / 5
ఫైనల్ గా: వాచెబుల్ థ్రిల్లర్ విత్ క్లెవర్ రైటింగ్స్
✍️. దాసరి మల్లేశ్