హీరోగా నటిస్తూనే తమ బేనర్‌లో సినిమాలు నిర్మిస్తారు విశాల్. హీరోగా, నిర్మాతగానే కాదు తమిళ చిత్ర పరిశ్రమలో పలు సమస్యలపై పోరాటం కూడా చేశారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. అయితే కొన్ని ఆరోపణలు కూడా అతనిపై వచ్చాయి. దానికి కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. విశాల్‌తో సినిమాలు చేయకూడదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. సమావేశంలో ఎక్స్ వేదికగా విశాల్ స్పందించారు.
‘నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. నన్నెవరూ ఆపలేరు. మీ పని చేసుకోండి మీరు’ అంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కి కౌంటర్ విశాల్ ఇచ్చారు. ఒకవేళ తనను ఆపాలని ప్రయత్నిస్తే అలా చేసిన వారు ఎప్పటికీ సినిమాలు నిర్మించలేరు. తను ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కౌన్సిల్ సభ్యుల సంక్షేమం కోసం నిధులు వినియోగించానని గుర్తు చేశారు. అంతేకాదు, వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఆరోగ్యబీమా కల్పించాలన్నారు. ఈ నిర్ణయాలన్నీ తానొక్కడినే తీసుకోలేదని, మిగిలిన సభ్యులతో కలిసి చేశానని చెప్పారు. ప్రస్తుత సంఘంపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, వాటిని సక్రమంగా చేస్తే సరిపోతుందని అన్నారు. తనకు సినిమాలు చేయకపోతే సొంతంగా తీసుకునే కెపాసిటీ తనకు ఉందని అందరికీ తెలుసునని గుర్తు చేశారు. తనను సినిమాలు చేయకుండా ఆపాలన్న ప్రయత్నం చేసే ముందు ఒకసారి ఆలోచించుకోమని కౌన్సిల్‌కు సలహా ఇచ్చారు విశాల్.