మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej)హీరోగా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఇందులో వరుణ్ కో వర్కర్ గా, ప్రేయసిగా, భార్యగా చేసిన భామ మానుషీ చిల్లర్(manushi chhillar)మూవీ పెద్దగా ఆడకపోయినా తన అందంతో పాటు అద్భుతమైన నటనతో మంత్రముగ్ధుల్ని చేసింది. తాజాగా మానుషీ కి సంబంధించిన న్యూస్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ హీరో వీర్ పహారియా(veer pahariya)తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీర్ ఎవరో కాదు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కి స్వయానా మనవడు. మానుషీ ఇటీవల బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ లో ఒక వీడియో షేర్ చేసింది.అందులో వీర్ భుజంపై ఆమె చాలా సేపు సేదతీరి ఉంది. దీంతో వీరే తో డేటింగ్ లో ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే వీడియోలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఆమె ప్రియుడు శిఖర్ పహారియా కూడా ఉన్నారు. శిఖర్ అండ్ వీర్ స్వయానా అన్నతమ్ములు. వీర్ సినిమాల్లో కూడా రాణిస్తు వస్తున్నాడు.
హరియాణా కి చెందిన మానుషీ చిల్లర్ 2017 లో విశ్వ సుందరిగా నిలిచింది. తెలుగు కంటే ముందే సామ్రాట్ పృథ్వీ రాజ్ అనే బాలీవుడ్ మూవీతో ఎట్రీ ఇచ్చింది అక్షయ్ కుమార్ హీరో. ఆ తర్వాత ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, బడే మియా చోట మియా సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం జాన్ అబ్రహం అనే మూవీ చేస్తుండగా.కథనాయికిగా విభిన్నమైన పాత్రల్లో నటించాలని గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో నటిస్తోంది.