అల్లు శిరీష్(allu sirish)ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)కి బ్రదర్, స్టార్ ప్రొడ్యూసర్ అరవింద్ కి కొడుకు. 2013లో గౌరవం అనే మూవీతో ఎంట్రీ ఇచ్చి కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబిసిడి ,ఊర్వశివో రాక్షసివో వంటి విభిన్న చిత్రాలతో తన కంట ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. లేటెస్ట్ గా బడ్డీ(బడ్డీ)తో రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం తెలుగు నాట హాట్ టాపిక్ గా మారింది.
డ్రామా అండ్ యాక్షన్ కామెడీ గా తెరకెక్కుతున్న బడ్డీ ఆగస్ట్ 2 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది. దీనితో ప్రతి ఒక్కరు బడ్డీని ఆశీర్వదించాలని చెప్పి చిత్ర యూనిట్ టికెట్స్ రేట్స్ ని తగ్గించింది. సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో హై క్లాస్ ని తొంబై తొమ్మిది రూపాయిలుగా,మల్టిప్లెక్స్ లలో నూట ఇరవై ఐదు రూపాయిలుగా ఫిక్స్ చేసారు. ఇప్పుడు ఈ తగ్గిన రేట్లు వలన ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా చూసే అవకాశం ఉంది. చిత్ర బృందం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కూడా అదే. అదే విధంగా ఫ్యూచర్ లో రాబోయే సినిమాలన్నీ బడ్డీని ఫాలోయేమో చూడాలి.
2021లో ఆర్య హీరోగా తమిళంలో వచ్చిన టెడ్డి మూవీ లైన్ ని తీసుకొని బడ్డీని తెరకెక్కించడం జరిగింది.గాయత్రీ భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్లుగా శ్యామ్ అంటోన్(సామ్ ఆంటోన్) దర్శకత్వం వహించాడు.తమిళ దర్శకుడు అయిన శ్యామ్ అక్కడ దాదాపు ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. స్టూడియో గ్రీన్ పతాకంపై అగ్ర నిర్మాత కె ఈ జ్ఞానవేల్ రాజా(కె జ్ఞానవేల్ రాజా)నిర్మించాడు.