బాబాయ్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకే వేదికపై కనిపించడం చాలారోజులు అవుతుంది. వీరిద్దరిని ఒకే వేదికపై చూడాలని నందమూరి అభిమానులు ఎంతగానో ఉన్నారు. అయితే ఆరోజు త్వరలోనే వచ్చే అవకాశం.
1974లో విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో తన సినీ కెరీర్ ప్రారంభించిన బాలకృష్ణ .. ఈ ఏడాదితో 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఘనంగా వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి టాప్ స్టార్స్ అంతా వచ్చే అవకాశం ఉంది. ఆ లిస్టులో ఎన్టీఆర్ కూడా ఉన్నాడని అంటున్నారు.
సినిమాలపైనే తన పూర్తి దృష్టిని పెడుతున్న ఎన్టీఆర్.. తాజాగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదు. దీంతో ఫ్యాన్స్ ఎంతో నిరాశలో ఉన్నారు. ఒకే వేదికపై నందమూరి కుటుంబాన్ని చూడాలని వారు ఆశపడుతున్నారు. ఈ కోరిక బాలయ్య 50 ఏళ్ళ వేడుకకు ఎన్టీఆర్ హాజరుకానున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. ఈ వార్త నిజమైతే మాత్రం నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.