గత కొన్ని రోజులుగా లావణ్య, రాజ్‌తరుణ్ ఇష్యూ మీడియాలో, సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ సంబంధించిన అన్ని విషయాలూ ప్రేక్షకులకు తెలుసు. ఇప్పటివరకు రాజ్‌తరుణ్ తనకు కావాలి, తన భర్త తన దగ్గరికి రావాలి అంటూ పట్టుపట్టిన లావణ్య.. ఇప్పుడు ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. తనకు రాజ్‌తరుణ్ అవసరం లేదంటూ కొత్త పాట పాడుతోంది. మరి ఈ ఇష్యూలో ఇలాంటి ట్విస్ట్ ఏమిటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ కంపెనీ ఆర్‌జె శేఖర్ బాషా పలు యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. లావణ్య, రాజ్‌తరుణ్‌ల మధ్య వున్న విభేదాలు, వారి మధ్య జరిగిన గొడవల గురించి పూస గుచ్చినట్టు చెప్పాడు. లావణ్య కూడా తన ఇంటర్వ్యూల్లో శేఖర్ బాషా గురించి రకరకాల కామెంట్స్ చేసింది.
వీరిద్దరినీ ఒకే స్టూడియోలో కూర్చోబెట్టి లావణ్య లాయర్‌ని లైవ్‌లోకి తీసుకొని చర్చా కార్యక్రమం పెట్టింది ఓ యూ ట్యూబ్ ఛానల్. రాజ్ తరుణ్ తనకు వద్దంటూ లావణ్య ప్రకటించిన తను వాళ్ళ విషయం మాట్లాడడానికి లైవ్‌కి రాలేదని, ఇప్పటివరకు లావణ్య ఎంతమంది అమ్మాయిల్ని డ్రగ్స్‌కి బానిస చేసింది అనే విషయాలు చెప్పడానికి వచ్చానని శేఖర్ బాషా స్పష్టం చేశాడు. లైవ్ స్టార్ట్ అయిన తర్వాత లావణ్య తరఫు లాయర్ దిలీప్ సుంకర, శేఖర్ బాషాల మధ్య వాడిగా, వేడిగా డిస్కషన్ జరిగింది. దిలీప్ సుంకర బండ బూతులు తిడుతూ శేఖర్ బాషాను రెచ్చగొట్టాడు. తను లావణ్య డ్రగ్స్ వ్యవహారం మాట్లాడడానికే వచ్చానని పదే పదే చెబుతున్నట్లు ఒక్కసారిగా అతనిపై తన చెప్పుతో దాడి చేసింది లావణ్య. అతన్ని చెప్పుతో కొట్టింది. ఆ కోరికనే శేఖర్ బాషా ఆమెను చేత్తో పక్కకు నెట్టాడు. శేఖర్ బాషాను బండ బూతులు తిట్టింది. ఓ పక్క దిలీప్ సుంకర, మరోపక్క లావణ్య బూతులు తిడుతున్నా.. శేఖర్ మాత్రం కంట్రోల్ గా ఉంటూ తన నోటి నుంచి ఒక్క బూతు కూడా రాకుండా జాగ్రత్త పడ్డాడు.
కాసేపటి తర్వాత వారికి నచ్చజెప్పి కూర్చోబెట్టిన తర్వాత కూడా దిలీప్ సుంకర, శేఖర్ బాషా మధ్య మాటా పెరగడం, దిలీప్ మళ్లీ బండబూతులు తిట్టడం జరిగింది. శేఖర్ మాత్రం అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న లావణ్యను విచారణ చేయవలసి వచ్చింది, డ్రగ్స్ కేసులో ఆమెకు మళ్ళీ శిక్ష పడాలని డిమాండ్ చేశాడు. అన్నీ విన్న లావణ్య లైవ్‌లో నుంచి బయటికి వెళ్ళిపోయింది.