ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దేవర’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం ద్వారా అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ‘చుట్టమల్లె’ రిలీజ్ అయింది. ఈ పాటకు చాలా మంచి స్పందన వస్తోంది. చాలా కాలం తర్వాత ఒక మంచి మెలోడీ సాంగ్ వచ్చిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. చుట్టమల్లె సాంగ్ వీడియోకి ఎన్టీఆర్ పాత సినిమాలో ఓ పాటను మిక్స్ చేసి ఓ అభిమాని రిలీజ్ చేసిన వీడియోను నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘యమదొంగ’లోని ‘నువ్వు ముట్టుకుంటే నే తట్టుకుంటాను..’ అంటూ సాగే పాట ఆడియోను ‘దేవర’లోని ‘చుట్టమల్లె’ పాట వీడియోకు మిక్స్ చేశారు. ఇది వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తుంటే అదే ఒరిజినల్ సాంగ్ అనే ఫీలింగ్ అందరికీ కలుగుతోంది. యమదొంగ పాటకు తగ్గట్టుగానే దేవర పాటలో స్టెప్స్, మూమెంట్స్‌లో ఉండటంతో అందర్నీ ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ‘దేవర’ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫియర్ సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో పాట కోసం చేసిన ఫ్యాన్ మేడ్ వీడియో మాత్రం హల్ చల్ చేస్తోంది.