‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాల తర్వాత మాస్ మహారాజా రవితేజ (రవితేజ), డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (మిస్టర్ బచ్చన్). పీపుల్ మీడియా నిర్మాణం ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. (మిస్టర్ బచ్చన్ ట్రైలర్)
‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. “సరిహద్దుని కాపాడేవాడే కాదు.. సంపదని కాపాడేవాడు కూడా సైనికుడే” అంటూ రవితేజ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో రవితేజ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపించాడు. బచ్చన్ గా ఆయన పాత్రను పరిచయం చేసిన తీరు బాగుంది. ప్రేమ, హాస్య సన్నివేశాలతో పాటు.. ఐటీ రైడ్స్ నేపథ్యంలో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఫుల్ మీల్స్ లా ట్రైలర్ ఉంది. “ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ ఫుల్లో.. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా అంతే పవర్ ఫుల్ అని నిరూపిస్తా” అంటే ఒక్క డైలాగ్ తో రవితేజ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో చూపించారు. ఇక జగపతి బాబు పాత్ర కూడా హీరో పాత్రకి ధీటుగా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారని అర్థమవుతోంది.
నిజానికి ‘మిస్టర్ బచ్చన్’ అనేది 2018లో వచ్చిన హిందీ చిత్రం ‘రైడ్’ కి రీమేక్. అయితే సినిమాలను తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా సరికొత్తగా ప్రజెంట్ చేయడంతో దిట్ట అయిన హరీష్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్’ మరోసారి అలాంటి మ్యాజిక్ చేయబోతున్నారని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. మరి ‘మిరపకాయ్’ వంటి సూపర్ హిట్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.