దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా సినీ పరిశ్రమ వెంటనే కనిపిస్తోంది. బాధితులను ఆదుకునేందుకు సినిమా కళాకారులు ఉదారంగా విరాళాలు అందజేస్తూ ఉంటారు. దేశంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రకృతి బీభత్సాలు జరిగాయి. వీరిలో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సినిమా కళాకారులు తమవంతు సాయం చేస్తూనే ఉన్నారు. వివిధ ప్రాంతాలకు హీరోలు జోలె పట్టి స్వయంగా వెళ్లి ప్రజల నుంచి విరాళాలు సేకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈమధ్యకాలంలో అలాంటి పరిస్థితి లేకుండానే సినీ ప్రముఖులే స్వచ్ఛందంగా బాధితులకు సాయం చేస్తున్నారు.
ఇటీవల కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో వర్షాల వల్ల జరిగిన బీభత్సం గురించి అందరికీ తెలుసు. తెల్లవారే లోపు కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది ఆచూకీ లభించలేదు. ఇప్పటివరకు దేశంలో జరిగిన విపత్తుల్లో వాయనాడ్ ఘటన చాలా పెద్దదిగా చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ వరదల కారణంగా నష్టపోయిన వారికి, నిరాశ్రయులైన వారికి అండగా నిలిచేందుకు సినీ పరిశ్రమ మరోసారి ముందుకొచ్చింది.
కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తమ విరాళాలను చూస్తున్నారు. ఇప్పటికే హీరో సూర్య, జ్యోతిక, రష్మిక, నయనతార, ఫహద్ ఫాజిల్ లక్షల రూపాయల విరాళాలను ప్రకటించారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కి కేరళలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్లో బన్నికి ఎంత క్రేజ్ ఉందో కేరళలో కూడా అంతే ఉంది. అందుకే అక్కడి వారికి ఏ ఆపద వచ్చినా సహాయం కోసం వస్తాడు బన్ని. ఆ కోరుకునే వాయనాడ్ బాధితుల కోసం రూ.25 విరాళం ప్రకటించారు అల్లు అర్జున్.
ఇప్పుడు ఏ భాషలో సినిమా నిర్మించినా దాన్ని పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు. దీనితో ప్రాంతీ భాషా చిత్రాలు విస్తరించాయి. చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలు కూడా పలు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. వీరిని కూడా అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దానికి కృతజ్ఞతగానే చిరు, చరణ్ కలిసి వాయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తాజాగా ప్రభాస్ కూడా బాధితుల కోసం 2 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.