ఏ ముహూర్తాన అల్లు అర్జున్(allu arjun)నంద్యాల సంఘటన జరిగిందో గాని అప్పటి నుంచి మెగా అండ్ అల్లు మధ్య సైలెంట్ వార్ నడుస్తుందనే చర్చ జరుగుతూనే ఉంది.అలాంటిదేం లేదు, అదంతా టీ కప్ లో తుఫాన్ లాంటిదనే కంబైండ్ ఫ్యాన్స్ కూడా లేకపోలేదు. కానీ పవన్ కళ్యాణ్(pawan kalyan)రీసెంట్ గా ఒకప్పుడు సినిమాల్లో అడవులను రక్షించే క్యారెక్టర్స్ లో హీరోలు కనపడే వాళ్ళు. కానీ ఇప్పుడు అడవులను నరికేసి, స్మగ్లింగ చేసే క్యారెక్టర్స్ ని చూస్తున్నారు అంటూ కామెంట్ చేసాడో, దిగ కూడని వాళ్లే రంగంలోకి దిగారు.
పవన్ చేసిన ఆ పోస్ట్ కి అల్లు అర్జున్ ఆర్మీ ఒక రేంజ్ లో కామెంట్స్ చేస్తుంది. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క. ఇక నుంచి జరగబోయేది ఒక లెక్క. ఇంక దాగుడు మూతలు లేవు. అఫీషియల్ గానే తేల్చుకుందాం అంటూ సోషల్ మీడియాలో తిష్ట వేశారు.అంటే కాదు బన్నీ కి సూచనలు కూడా ఇస్తున్నారు. డైరెక్ట్ గా పవన్ కల్యాణే రంగంలోకి దిగాడు, ఇక నువ్వు సైలెంట్‌గా ఉంటే కుదరదు, ఆల్ రెడీ ఒకడు కావాలని పుష్ప 2 రిలీజ్ కే తన సినిమాతో వస్తున్నాడు.నువ్వు తగ్గొద్దు, పుష్ప 2(పుష్ప 2)తో మనమేంటో చూపించాల్సిందే అంటున్నారు. ఇక మరికొంతమంది ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ నిన్న సుద్దపూసల పుష్పంపై సెటైర్లు వేసాడు కదా, మరి ఆయన ఎంత గొప్ప సినిమాలు తీశారో చూడండి అంటూ పెద్ద లిస్ట్ నే పోస్ట్ చేసాడు .
సమాజానికి పనికివచ్చే సినిమాల్లో పవన్ కళ్యాణ్ మరపురాని పాత్రలు అనే క్యాప్షన్ తో గోకులంలో సీతలో అమ్మాయిల పిచ్చి, తొలి ప్రేమ(థోలిప్రేమ)లో చదువు సంధ్యలు లేవు, తమ్ముడు పనికిరాని కొడుకు, జాని వీధి రౌడి, గుడుంబా శంకర్ సారా అమ్మే వ్యక్తి, పంజా(పంజా)కాంట్రాక్ట్ కిల్లర్ అంటూ పవన్ చేసిన సినిమాలపై ఘాటు సెటైర్లే చేస్తున్నారు. అలానే తీన్మార్ సినిమాలో ఒక డైలాగ్‌తో కూడా కౌంటర్లు వేస్తున్నారు. ఇక వీటికి అదే రేంజ్‌లోనే మెగా అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు. ఆ సినిమాల్లోని క్యారెక్టర్స్ ల అంతిమ లక్ష్యం చూడండి.. కానీ మీ పుష్ప మారడు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయంలో అసలు సిసలు కొసమెరుపు ఏంటంటే అల్లు ఫ్యాన్స్‌కి వైసీపీ అభిమానులతో పాటు సోషల్ మీడియా వింగ్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుండటం.