ఇండస్ట్రీలో ఎవరి రేంజ్ ఎలాంటిదో చెప్పేది హిట్ మాత్రమే. వాటిని చూసి చాలా కాలమైన హీరో నాగ శౌర్య(Naga shaurya)2018 లో రష్మిక(rashmikha mandanna)తో కలిసి చేసిన చలో తర్వాత ఇంతవరకు హిట్ లేదు. ఒక పర్ఫెక్ట్ హీరోకి కావలసిన అన్ని లక్షణాలు పుష్కలంగానే ఉన్నాయి. కానీ విజయం పూర్తిగా దూరాన్ని మెయింటెన్స్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు.
నాగ శౌర్య గత చిత్రం రంగబలి. రిలీజ్ మొదట్లో హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా ఆ తర్వాత డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయనుకోండి. ఇక రంగబలికి పవన్ బాసంశెట్టి దర్శకుడు. మళ్ళీ నాగ శౌర్య తన నెక్స్ట్ మూవీని పవన్(పవన్)తోనే చేయబోతున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పవన్ తో కాకుండా రమేష్ దాసిన దర్శకత్వంలో నాగ శౌర్య సినిమా చెయ్యబోతున్నాడు. చేయబోతుండటమే కాదు ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభించాడు కూడా. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ని ఎన్నో సినిమాల కథలు విని నాగ శౌర్య ఒకే చేసాడు.
ఇక సుమారు సంవత్సరం తర్వాత తమ హీరో కొత్త సినిమా ప్రకటించడంతో అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మూవీ ఘన విజయం సాధించాలని కూడా కామెంట్స్ చేస్తున్నారు. నూతన చిత్ర నిర్మాణ సంస్థ వైష్ణవి ఫిల్మ్స్ నిర్మిస్తుండగా ఎన్నో హిట్ పాటలతో ప్రియులని ఉర్రూతలూగించిన హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందించాడు. ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.