నో డౌట్.. గబ్బర్ సింగ్(gabbar singh)మూవీ షూట్ లో నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అని పవన్ (pawan kalyan)చెప్పేటప్పుడు పక్కనే సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)ఉండే ఉంటాడు. పైగా పవన్ కి ఒక మాట కూడా ఇచ్చి ఉంటాడు. రాబోయే రోజుల్లో నా ఫ్యాన్స్ ట్రెండ్ సెట్ చేస్తారని. మహేష్ ఇచ్చిన ఆ మాటకి తగ్గట్టే ఫ్యాన్స్ ఒక నయా ట్రెండ్ ని క్రియేట్ చేసారు.
మహేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ గా నిలిచిన మూవీ మురారి(మురారి)2001 విడుదలైన అన్ని చోట్లా ఘన విజయం సాధించింది. రీసెంట్ గా రీ రిలీజ్ అవ్వడంతో కృష్ణ, మహేష్ అభిమానులు థియేటర్స్ కి పోటెత్తారు. చాలా ఏరియాలో టికెట్స్ దొరకని పరిస్థితి కూడా ఉంది. ఇక స్క్రీన్ మీద మూవీ రన్ అవుతున్నప్పుడు థియేటర్ లోపల ఒక సరికొత్త ట్రెండ్ కి నాంది వేశారు ఫ్యాన్స్. ఒక నూతన జంట థియేటర్ లో వివాహం చేసుకుంది. మూవీలోని అద్భుతమైన సాంగ్స్ లో ఒకటైన అలనాటి రామ చంద్రుడు అన్నింటా సాటి ప్లే అవుతున్నప్పుడు నూతన జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లోనే వైరల్ అవుతుంది.
అదే విధంగా నూతన జంటకి అభినందనలు కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మహేష్ ఫ్యాన్స్ ఇంకెన్ని ట్రెండ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఇక మురారి ఓవర్ ఆల్ గా తొలి రోజే డెబ్భై ఐదు లక్షల గ్రాస్ ని బిల్డింగ్. ఓవర్ సీస్ లో రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.