‘దేవర’ (దేవర) సెకండ్ సింగిల్ గా విడుదలైన ‘చుట్టమల్లె’ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో కేవలం వారం రోజుల్లోనే 50 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించింది.. వేగంగా 50 మిలియన్ మార్క్ ని లిరికల్ వీడియోగా పొందింది. (దేవర పాటలు)
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘దేవర’. అనిరుధ్ సంగీతం అందిస్తోంది ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదలైన ‘ఫియర్ సాంగ్’ పెద్ద హిట్. అయితే సెకండ్ సింగిల్ గా వచ్చిన ‘చుట్టమల్లె’ సాంగ్ అంతకుమించిన సంచలనాలు సృష్టిస్తోంది. రెండు నెలల క్రితం విడుదలైన ఫియర్ సాంగ్ 50 మిలియన్ కి చేరవుతుండగా.. వారం రోజుల క్రితం విడుదలైన ‘చుట్టమల్లే’ సాంగ్ అప్పుడే 50 మిలియన్ మార్క్ ని దాటేసింది. లిరికల్ వీడియోల పరంగా ఇది ఫాస్ట్ ఫీట్ అంటూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంది. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ పరంగానూ ‘చుట్టమల్లె’ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. ఈ రెండు సాంగ్స్ కే ఇలా ఉంటే.. నెక్స్ట్ ఆయుధపూజ సాంగ్, డాన్స్ డ్యూయెట్ రాబోతున్నాయని.. ఆ రెండు సాంగ్స్ తో యూట్యూబ్ మరింత షేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, సుధ ఆర్ట్స్ సంయుక్తంగా దేవర మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదల. సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.