గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్, లావణ్య కేసు మీడియాలో, సోషల్ మీడియాలో ఎంతటి సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధం ఉన్నవారి ప్రధానం మస్తాన్ సాయి పేరు వినిపించింది. అతనిపై ఈ కేసుకు సంబంధించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు అతను ఎలా ఉంటాడో ఎవ్వరికి తెలీదు. అతని ఫోటో కూడా ఇప్పటివరకు ఎక్కడా బయటికి రాలేదు. తాజాగా అతని ఫోటోతోపాటు ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. ఈరోజు గుంటూరులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జూన్ 24న ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న బ్యాచ్‌ని విజయవాడ రైల్వేస్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో తెలివిగా పోలీసులకు టోకరా వేసి తప్పించుకున్నాడు మస్తాన్ సాయి. గతంలో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న మస్తాన్‌ను ఎట్టకేలకు గుంటూరులో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రాజ్‌తరుణ్, లావణ్య వివాదానికి సంబంధించిన అరెస్ట్ కానప్పటికీ లావణ్య కూడా డ్రగ్స్ కేసులో ఇన్‌వాల్వ్ అయి ఉండటం, మస్తాన్ సాయికి కూడా కేసుతో సంబంధం ఉండటంతో ఈ అరెస్ట్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అంతేకాదు, మస్తాన్ సాయి దగ్గర ఎంతో మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు మస్తాన్ అరెస్ట్ కావడంతో రాజ్ తరుణ్, లావణ్య కేసులో టర్న్ అయ్యే అవకాశం ఉంది.