ఈ వారం థియేటర్లలో సినిమా సందడి బాగానే ఉంది. ఆగష్టు 15న ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’, ‘ఆయ్’ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ మూవీ ‘తంగలాన్’ విడుదలవుతోంది. ఈమధ్య కాలంలో ఒకేసారి నాలుగు చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల కావడం ఇదే అని చెప్పవచ్చు. ఈ నాలుగు సినిమాలు కూడా వేటికవే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
‘మిరపకాయ్’ వంటి సూపర్ హిట్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘మిస్టర్ బచ్చన్’ (మిస్టర్ బచ్చన్). హిందీ మూవీ ‘రైడ్’కి రీమేక్ గా రూపొందించబడింది. ఒరిజినల్ స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని, తెలుగు ప్రేక్షకుల టేస్ట్ గా మలిచి, హిట్ కొట్టడం హరీష్ శంకర్ కి అలవాటు. ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’కి కూడా అదే ఫాలో అయ్యాడని ప్రచార చిత్రాలతో క్లారిటీ వచ్చింది. మరి ఈ సినిమాతో రవితేజ, హరీష్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ గా వస్తున్న మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ (డబుల్ ఐస్మార్ట్). మాస్ ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సీక్వెల్ ‘ఇస్మార్ట్ శంకర్’ మాదిరిగానే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.
‘మ్యాడ్’ వంటి ఎంటర్టైనర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. ఇప్పుడు ‘ఆయ్’ (Aay) అనే మరో ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ తో యూత్ దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయమంటున్నారు.
కోలీవుడ్ స్టార్ విక్రమ్ కి తెలుగునాట కూడా మంచి గుర్తింపు వచ్చింది. సినిమా కోసం ఎంతైనా కష్టపడతాడనే పేరు ఆయనకుంది. ఇప్పుడు విక్రమ్ ‘తంగలాన్’ (తంగళన్) అనే పిరియాడిక్ యాక్షన్ డ్రామాతో వస్తున్నాడు. పా రంజిత్ దర్శకుడు. ఈ సినిమాపై తెలుగునాట కూడా మంచి బాజ్ ఉంది. విక్రమ్ కష్టానికి తగ్గ ఫలితం ఈ చిత్రంతో లభిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.