రామ్(ram potineni)అండ్ పూరి(puri jagannadh)ల డబుల్ ఇస్మార్ట్ (double ismart)ఈ నెల 15 న వరల్డ్ వైడ్ గా విడుదల చేయబడింది. ఈ నేపథ్యంలో అదిరిపోయే జాక్ పాట్ ని కొట్టింది. దీనితో డబుల్ ఇస్మార్ట్ టీం కి ఫుల్ ఎనర్జీ వచ్చినట్లయ్యింది. అంతే కాకుండా నూతన రికార్డులని తాను కూడా సృష్టిస్తాననే భరోసా ని సిల్వర్ స్క్రీన్ కిట్టయ్యింది. ఇంతకీ అదేంటో చూద్దాం.
డబుల్ ఇస్మార్ట్ టీం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కలిసి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు అడిగారు. దీంతో ఏపి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే క్యూరియాసిటీ అందరిలో మొదలయ్యింది.ఈ నేపథ్యంలో ప్రతి టికెట్ పై 35 రూపాయలు పెంచుకునే విధంగా ఏపి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పది రోజుల పాటు పెంచుకున్న ధరలు వర్తిస్తాయని కూడా వెల్లడి చేసింది. కాకపోతే తెలంగాణ లో మాత్రం మాములు రెట్లకే ప్రదర్శిస్తారు.
2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సిక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ విడుదల చేయడంతో అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ తో కావ్య థాపర్ జత కట్టగా విలన్ గా సంజయ్ దత్ చేస్తుండటం అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇంకో ఆసక్తి కర విషయం ఏంటంటే ఇస్మార్ట్ విజయం తర్వాత పూరి,రామ్ ఇద్దరకీ హిట్స్ లేవు. ఈ డబుల్ ఇస్మార్ట్ ఫలితం మీద అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.ఆల్రెడీ మణిశర్మ సంగీతంలోని పాటలు మోతమోగిపోతున్నాయి.