పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)నాచురల్ స్టార్ నాని(nani)ఈ ఇద్దరి పేర్లు పక్కన వినపడుతుంటే ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి. మరి ఆ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో మెరిస్తే, ఇక ఆ సినిమా అప్ డేట్స్, రికార్డుల కోసం సోషల్ మీడియాలో అదే పనిగా ఫాలో అయ్యే వాళ్ళు కోట్లలోనే ఉంటారు. ప్రస్తుతానికి అయితే అలాంటి న్యూస్ ఏది లేదు. కాకపోతే ఒక న్యూస్ మాత్రం ఇద్దరి ఫ్యాన్స్ ని ఆకర్షిస్తుంది. మూవీ లవర్స్ అయితే ఇది కదా మాకు కావాల్సింది అంటున్నారు.
నాని అప్ కమింగ్ మూవీ సరిపోదా శనివారం(saripoda sanivaram)అగస్ట్ 29న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైంది. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. అభిమానుల సమక్షంలో హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. నాని అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిమాన హీరోని చూసి మురిసిపోయారు. ఇంత వరకు బాగానే ఉంది.కాకపోతే ఈ పేజీలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ విషయం వాళ్ళ అరుపుల ద్వారా స్పష్టంగా అర్ధమవుతుంది. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా సరిపోదా శనివారం ఘన విజయం సాధించాలని తమ వంతుగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎంటైర్ తతంగం మొత్తం మీద మూవీ లవర్స్ అయితే చాలా హ్యాపీగా ఉంది.ఎనీ హీరో అభిమానులు మా హీరో మీ హీరో తక్కువ అని అనుకోకుండా ఒకరి సినిమాలకి ఒకరు సహకరించాలంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ఇక సరిపోదా శనివారం కి ఉన్న ఇంకో స్పెషల్ ఏంటంటే ఆర్ ఆర్ ఆర్ దానయ్య(danayya)నిర్మాత. పవన్ ఓజి (og)కి కూడా దానయ్యే నిర్మాత. అదే విధంగా రెండు సినిమాల్లోను ప్రియాంక మోహన్ (priyanka mohan)నే హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పుడు ఈ విషయం కూడా సినీ సర్కిల్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక సరిపోదా శనివారం ట్రైలర్ రికార్డులు సృష్టిస్తుంది. మిలియన్స్ లో వ్యూస్ ని సాధిస్తూ ఎండింగ్ వ్యూస్ ని చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చింది. వివేక్ ఆత్రేయ దర్శకుడు గతంలో నాని, వివేక్ కాంబోలో అంటే సుందరానికి వచ్చి మంచి విజయాన్నే నమోదు చేసింది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనేలా ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కి నాని మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.