70వ జాతీయ అవార్డులను ప్రకటించారు. అయితే ఈసారి తెలుగు సినిమాలకు పెద్దగా అవార్డులు రాలేదు. తెలుగు వాళ్లకు మాత్రం రెండు అవార్డులు వచ్చాయి. అవార్డుల విషయంలో తమిళ, కన్నడ, హిందీ చిత్రాల హవానే కొనసాగింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిఖిల్ నటించిన కార్తికేయ 2 నిలిచింది. అలాగే బెస్ట్ కొరియోగ్రాఫర్ కేటగిరీలో జానీ మాస్టర్‌ను జాతీయ అవార్డు వచ్చింది. ఐతే జానీ మాస్టర్‌కి ఈ అవార్డు వచ్చింది తెలుగు సినిమాకు కాదు కోలీవుడ్ మూవీ “తిరుచిత్రాంబళం”. ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో “తిరు”గా డబ్బింగ్ అయ్యింది. ఈ సినిమాకు కొరియోగ్రఫీ పట్టా జానీ మాస్టర్‌ను జాతీయ అవార్డు వరించింది. ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో “మేఘం కరిగేనా పిల్లో పిల్లై” అనే సాంగ్ కి ధనుష్, రాసి ఖన్నా, నిత్యా మీనన్ తో కలిసి చేసిన డాన్స్ కి జానీ మాస్టర్ కోరియోగ్రఫీ చేసాడు.
ఆ సాంగ్ డాన్స్, లిరిక్స్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సాంగ్ లో స్టెప్స్ చాలా క్రిస్టల్ క్లియర్ గా చూసే కొద్దీ చూడబుద్దేసేదిలా ఉంటాయి. ఇక జానీ మాష్టర్ ని ఏపీ డిప్యూటీ సీఎం కూడా విష్ చేశారు. సామాజిక స్పృహ కలిగిన కళాకారుడు జానీ మాస్టర్ అన్నారు పవన్ కళ్యాణ్. జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నృత్య దర్శకుడిగా ఎంపికైన జానీ మాస్టర్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన డాన్స్ లో జానపద, పాశ్చాత్య శైలుల మేళవింపు ఉంటుందన్నారు. జానీ మూవీ టైములో కొరియోగ్రాఫర్ల బృందంలో ఒకరిగా పరిచయమయ్యారని తాను చేసిన ఎన్నో మూవీస్ కి కూడా పని చేశారన్నారు పవన్ కళ్యాణ్. అలా ఆయన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో చేరారని జానీ మాష్టర్ ఇలాంటి మరెన్నో అవార్డ్స్ అందుకోవాలని ఆకాంక్షించారు. ఇక జానీ మాష్టర్ కి అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు.