బాలీవుడ్ స్టార్స్ సౌత్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తమిళ దర్శకులతో సినిమాలకు క్యూ కడుతున్నారు. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమా చేశాడు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ మూవీ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అమీర్ ఖాన్ వంతు వచ్చింది.
సౌత్ సంచలన దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ ఒకరు. సినిమా సినిమాకి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు. అలాంటి లోకేష్ తో ఆమిర్ ఖాన్ చేతులు కలపబోతున్నట్లు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఈ ఇద్దరు కలపబోతున్నారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించనుందట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ దగ్గర మరో వెయ్యి కోట్ల బొమ్మ పడినట్లే అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం రజినీకాంత్ తో ‘కూలీ’ అనే మూవీ చేస్తున్నాడు లోకేష్. దీని తర్వాత ఆయన చేయబోయే సినిమా అమీర్ తోనే అని టాక్ నడుస్తోంది.