మూవీ: ఏవోల్
నటీనటులు: శివకుమార్ రామచంద్రవరపు, సూర్య శ్రీనివాస్, జెనిఫర్ ఇమ్మాన్యుయల్, దివ్య శర్మ చేశారు.
ఎడిటింగ్: విజయ్
సంగీతం: సునీల్ కశ్యప్
నిర్మాత, దర్శకత్వం: రామ్ యోగి వెలగపూడి
ఓటీటీ: ఆహా
కథ:
ఈ కథ ప్రధానంగా ప్రభు, నిధి, రిషి, ప్రశాంతి ల చుట్టూ తిరుగుతుంది. ప్రభు, నిధి ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళకి పెళ్లి జరిగి సంవత్సరాలు అవుతుంది. ఒకరోజు రాత్రి తనకి పెళ్లి ముందు నుండి ప్రశాంతి అనే అమ్మాయితో ఎఫైర్ ఉందని ప్రభు తన భార్య నిధితో చెప్తాడు. దాంతో నిధి షాక్ అవుతుంది. ఏంటి జోక్ చేస్తున్నావా అని నిధి అడుగగా.. లేదు సీరియస్ డైవర్స్ తీసుకుందామని ప్రభు అనగానే.. నిధి సరేనంటుంది. ఆ విషయం తన స్నేహితుడు అయినటువంటి రిషికి చెప్తుంది నిధి. అయితే రిషితో నిధికి ఉంది స్నేహమేనా లేక ఎఫైరా? అసలు నిధి, ప్రభులు విడిపోయారా లేదా కలిసే ఉన్నారా అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
భార్యాభర్తలు ఉద్దరు కొన్నేళ్లకి విడిపోదామని అనుకుంటారు. ఎందుకంటే వారికున్న ఎఫైర్.. ఇదే కథని కాస్త బోల్డ్ సీన్లతో తెరకెక్కించాడు దర్శకుడు. ఈ మూవీ ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ,
ఈ సినిమాని సెన్సార్ బోర్డ్ ఎందుకు రిలీజ్ అవ్వకుండా ఆపేసిందో ఓ పదిహేను నిమిషాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. కథ మొత్తం బోల్డ్ సీన్లు, డ్రగ్స్, సిగరెట్లు ఇలా ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్యామిలీతో కలిసి చూసేలా లేవు. పెళ్లి తర్వాత ఎఫైర్ తప్పు కాదంటూ చూపిస్తారు. దర్శకుడు సమాజానికి ఏం చెప్పాలనుకున్నాడంటే ఈ కాలంలో లవ్ పేరుతో పెళ్లి తర్వాత కూడా కలిసే ఉండొచ్చని దర్శకుడు భావించాడు. కానీ అది వేరే లో పోతుంది. రత్తాలు రైసుమిల్లు, సందట్లో సడేమియా లాంటి కథలని కాస్త ట్రెండీగా ‘ఎవోల్’ అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు. సినిమా నిడివి కూడా చాలా ఎక్కువ. ,
అసలు చెప్పాలంటే ఇది ఓ షార్ట్ ఫిల్మ్ స్టోరీ. దీనిని లాగీ లాగీ సినిమాగా మలిచారు. డైలాగ్స్ కూడా మరీ బోల్డ్ గా ఉన్నాయి. అసలు కథలోనే క్లారిటీ లేదు. అందులోను అర్థం పర్థం లేని సీన్లు, లిప్ లాక్ లు, రొమాన్స్, ఇలా ఒక్కటేంటి.. భార్యాభర్తలు అని చెప్పుకుంటూ యదేచ్ఛగా ఎఫైర్ పెట్టుకోవడం.. ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ ఎఫైర్ ల గురించి నలుగురికి తెలుస్తుంది. కథలో ఏమీ లేదు. అయిన అంతా నిడివి అవసరం లేదు. సినిమాలో ఇది బాగుందని చెప్పడానికి ఏదీ లేదు. ఇద్దరు హీరోయిన్ లని అందాల ఆరబోత కోసమే తీసుకున్నారు. ఎడిటింగ్ బాగుంది. మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
శివకుమార్ , సూర్య శ్రీనివాస్, జెనిఫర్, దివ్య శర్మ సినిమాకి ఫ్రధాన బలంగా నిలిచారు. మిగిలినవారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా: నాట్ ఫర్ కామన్ ఆడియన్స్. విపరీతమైన బోల్డ్ అండ్ ల్యాగ్.
రేటింగ్: 2/5
✍️. దాసరి మల్లేశ్