ఒకప్పుడు థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతోందంటే మూవీ లవర్స్‌కి ఒక పండగలా ఉండేది. కొత్త సినిమా కోసం ప్రతి శుక్రవారం ఎదురు చూసేవారు. అలాంటి పండగ వాతావరణం థియేటర్ల నుంచి ఇప్పుడు ఇంటికి చేరింది. ఇప్పుడు ఆ ప్లేస్‌ని ఓటీటీ ఆక్రమించింది. ఎందుకంటే ప్రతి వారం వివిధ భాషల్లో లెక్కకు మించిన సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. గత కొన్ని రోజులుగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆగస్ట్ 15 చప్పగానే వెళ్లిపోయారు. డబ్బింగ్ సినిమాతో కలిపి నాలుగు సినిమాలు ప్రధానంగా రిలీజ్ అయ్యాయి. కానీ, వాటిలో రెండు సినిమాలు మాత్రమే మంచి టాక్ తెచ్చుకున్నాయి.
మొదటి నుంచీ డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ చిత్రాలపైనే అందరి దృష్టీ ఉంది. అదేరోజు విడుదలైన తంగలాన్‌ను ఒక డబ్బింగ్ సినిమాగానే ఇచ్చారు తప్ప అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీకి పరిచయమైన నార్నే నితిన్ హీరోగా రూపొందించిన ఆయ్ చిత్రం విడుదలైంది. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికలపడగా.. తంగలాన్, ఐ’ పాజిటివ్ టాక్‌తో ముందుకు దూసుకుపోతున్నాయి. వీటిలో తంగలాన్ చిత్రం తమిళ్‌లో, తెలుగులో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఇక ఈ వారం విషయానికి వస్తే.. తెలుగు సినిమా ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ అంటే తెలుగు మూవీ, ‘డిమోంటీ కాలనీ 2’ అంటే డబ్బింగ్ సినిమా మాత్రమే రిలీజ్ అవుతుంది.
ఇలాంటి పరిస్థితిలో ఈ వారం ఓటీటీకి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే కల్కి, రాయన్ వంటి సినిమాలు ఓటీలో రిలీజ్ అవుతున్నాయి.
వీటితోపాటు ‘గర్‌ఆర్’ అనే మలయాళ డబ్బింగ్ మూవీపై కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్‌లు ఉన్నాయి. గత కొంత కాలంగా కమింగ్ సూన్ అందర్నీ ఎలర్ట్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఎప్పటిలాగే కొన్ని హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి. ఈవారం ఓటీటీలో సందడి చేయబోయే ఆయా సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో:
యాంగ్రీ యంగ్ మ్యాన్: ద సలీం జావేద్ స్టోరీ (హిందీ వెబ్ సిరీస్) ఆగస్టు 20
కల్కి 2898 ఏడీ (తెలుగు వెర్షన్) ఆగస్టు 22
ఫాలో కర్‌లో యార్ (హిందీ వెబ్ సిరీస్) ఆగస్టు 23
రాయన్ (తెలుగు వెర్షన్) ఆగస్టు 23
నెట్ ఫ్లిక్స్:
టెర్రర్ ట్యూజ్డే: ఎక్స్‌ట్రీమ్ (థాయ్ వెబ్ సిరీస్) ఆగస్టు 20
జీజీ ప్రీసింక్ట్ (కొరియన్ వెబ్ సిరీస్) ఆగస్టు 22
కల్కి 2898 ఏడీ (హిందీ వెర్షన్) ఆగస్టు 22
మెర్మైడ్ మ్యాజిక్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) ఆగస్టు 22
ప్రెట్టీ గార్డియన్ సెయిలర్ మూన్ కాస్మోస్ ద మూవీ పార్ట్ 1 (జపనీస్ మూవీ) ఆగస్టు 22
ఇన్ కమింగ్ (ఇంగ్లీష్ మూవీ) ఆగస్టు 23
ద ఫ్రాగ్ (కొరియన్ వెబ్ సిరీస్) ఆగస్టు 23
ఆహా:
ఉనర్వుగల్ తొడరకథై (తమిళ సినిమా) ఆగస్టు 23
లయన్స్ గేట్ ప్లే :
ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ (ఇంగ్లీష్ సినిమా) ఆగస్టు 23
జియో సినిమా :
డ్రైవ్ ఏవే డాల్స్ (ఇంగ్లీష్ సినిమా) ఆగస్టు 23
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
గర్ర్‌ర్ (తెలుగు వెర్షన్) ఆగస్టు 20
ది సుప్రీమ్స్ ఎట్ ఎర్ల్స్ ఆల్ యూ కెన్ ఈట్ (ఇంగ్లీష్ మూవీ) ఆగస్టు 23
మనోరమ :
స్వకార్యం సంభవబాహులం (మలయాళం సినిమా) ఆగస్టు 23
ఆపిల్ ప్లస్ టీవీ:
పచింకో సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్) ఆగస్టు 23