దేశంలో సోమవారం రక్షాబంధన్ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం తోబుట్టువులతో రాఖీలు కట్టించుకొని సోషల్ మీడియాలో ఆ ప్రొవైడ్ పోస్ట్ చేశారు. ఈ వంటినే ‘దేవర’ హీరోయిన్ జాన్వీకపూర్ కూడా ఒక అభిమానికి రాఖీ కట్టింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అది ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశం. హిందీ సినిమా షూటింగ్ అని అక్కడి వారి లాంగ్వేజ్‌ని బట్టి అర్థమవుతోంది. జాన్వీని చూసేందుకు ఎంతో మంది ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు.
అదే సమయంలో జాన్వీ ఫోటో సెషన్ కూడా జరిగింది. మీడియాకి సంబంధించిన వారు ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగానే మీడియాలోని ఓ రిపోర్టర్.. వై.పి.లో ఉన్న సోదరి తనకు రాఖీ పంపిందని, అది మీరు కట్టాలని జాన్వీని కోరాడు. దానికి ఎంతో సంతోషంగా ఒప్పుకున్న జాన్వీ అతని కోరిక మేరకు రాఖీ కట్టింది. ఆ తర్వాత అతను జాన్వీకి గిఫ్ట్‌గా డబ్బు ఇచ్చేందుకు జేబులో పెట్టగానే వద్దొద్దు.. అంటూ బై చెప్పి వెళ్లిపోయింది. అయినా ఆ రిపోర్టర్ ఆమె వెంట వెళ్ళబోయాడు. కానీ, ఆ ఛాన్స్ ఇవ్వకుండా వడివడిగా సెట్‌లోకి వెళ్లిపోయింది జాన్వీ. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
అడిగిన వెంటనే రాఖీ కట్టిన జాన్వీ మంచి తనాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మరికొందరు అంత అందమైన అమ్మాయితో రాఖీ కట్టించుకోవడానికి నీకు మనసెలా వచ్చిందిరా అని ఒకరు కామెంట్ చేశారు. ‘దేవర’ హీరోయిన్‌తో రాఖీ కట్టించుకున్న నువ్వు గ్రేట్ బ్రో అంటూ మరో కామెంట్ వచ్చింది. అందులోని ఓ చిలిపి కామెంట్ అందర్నీ ఆకర్షిస్తోంది. అదేమిటంటే.. జాన్వీతో రాఖీ కట్టించుకున్నది ఎవరో కాదు.. నా బావమరిది అంటూ ఫన్నీగా పెట్టిన కామెంట్ చూసి అందరూ రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నారు.
‘దేవర’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న జాన్వీకపూర్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రామ్‌చరణ్‌తో కూడా జాన్వీ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో వరల్డ్‌వైడ్‌గా పాపులర్ అయిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో చేస్తున్న సినిమాలతో వస్తున్న జాన్వీకి టాలీవుడ్‌లో గ్రాండ్‌వెల్‌కమ్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.