ఇటీవల ఆస్ట్రేలియాలో ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డు కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. పలు భాషలకి చెందిన హీరో, హీరోయిన్, దర్శకులు అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆగస్ట్ 15 న మొదలైన ఆ ఈవెంట్ ఆగస్ట్ 25 వరకు జరగనుంది. ఇక ఈ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan)కూడా హాజరయ్యాడు ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ కి అంబాసిడర్ గాందుకు అవార్డుని అందుకున్నాడు. ఈ ఆస్ట్రేలియా క్యాపిటల్ మెల్ బోర్న్ కి చెందిన గవర్నర్ చరణ్ ని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసాడు. ఇప్పుడు అది వైరల్ గా మారింది.
మెల్ బోర్న్ మేయర్ పేరు నిక్ రైస్. అవార్డుల కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నపుడు ప్రోగ్రాం ఆసాంతం చరణ్ పక్కనే ఉన్నాడు.చరణ్ తో సెల్ఫీ కూడా దిగాడు. ఇప్పుడు ఈ విషయంపైనే ఇనిస్టా వేదికగా తన స్పందనని తెలియచేసాడు. నేను చరణ్ కి పెద్ద అభిమానిని.నాకున్న కోరికల లిస్ట్ లో చరణ్ తో సెల్ఫీ దిగాలనే కోరిక కూడా ఒకటి. అది నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. చరణ్ రేంజ్ విశ్వవ్యాప్తం అయ్యిందనటానికి నిక్ మాటలే నిదర్శనమని అంటున్నారు. మా చరణ్ పర్ఫెక్ట్ గ్లోబల్ స్టార్ అని కూడా అంటున్నారు. అదే విధంగా రేపు గేమ్ చెంజర్ మెల్ బోర్న్ లో రిలీజ్ అయినప్పుడు మొదటి ఆట, మొదటి టికెట్ ని నిక్ నే తీసుకుంటాడని కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ఇక ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల భారతీయ జెండా ని చరణ్ ఎగరేసాడు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చెంజర్ (గేమ్ ఛేంజర్)కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో చూస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్(rrr)తర్వాత వస్తున్న మూవీ కూడా కావడంతో ఒక రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ ఇంకా అధికారకంగా రాలేదు. కానీ ఈ సంవత్సరం రావడం మాత్రం పక్కా .తన నెక్స్ట్ మూవీని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్నాడు.