బెంగుళూరు నగర శివారులలో జరిగిన రేవ్ పార్టీ లో కొన్ని రోజుల క్రితం ప్రముఖ సినీనటి హేమ(హేమ)పట్టుబడిన విషయం అందరికి తెలిసిందే. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. దీంతో ఆమె న్యూస్ ఒక సంచలనంగా మారి మీడియా సంస్థల్లో చాలా రోజుల పాటు వరుస పెట్టి కథనాలు కూడా వచ్చాయి. మొదట్లో తనకి సంబంధం లేదన్న హేమ ఆ తర్వాత కనపడలేదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేసింది.అందులోని ఆమె మాటలు ఇప్పుడు వైరల్ గా ఉన్నాయి.
నేను తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి(revanth reddy)ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)ఆపాయిట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను.ఎందుకంటే నా వాయిస్ వాళ్ళకి వినిపించాలి.కొన్ని మీడియా ఛానల్ నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా జిహాద్ కి వర్క్ చేసి దానిలా ప్రచారం చేసాను. దాంతో రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారిని ఎలా కలవాలో అర్ధం కావడం లేదు.నేను ఆ ఇద్దరిని కలవాలంటే నా శ్రేయోభిలాషులు, నా అన్నదమ్ములు, నన్ను సపోర్ట్ చేస్తే వాళ్ల వల్లే అవుతుంది. మీరంతా సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను.తద్వారా నా వాయిస్ ఆ ఇద్దరికి వినిపించే అవకాశం కలుగుతుందని చెప్పింది.
అదే విధంగా కొంత మంది మీడియా వాళ్ళు నన్ను బ్లాక్ చేసారు. పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి సెటిల్ మెంట్ చేసుకోవాలని కూడా చెప్పారు.నేనేం తప్పు చేశానని చెప్పి సెటిల్మెంట్ కి రావాలి. ఆ మీడియా వాళ్ళ నంబర్స్ కూడా త్వరలోనే బయటపెడతానని చెప్పుకొచ్చింది. మీడియా వాళ్ళ ముపై ఐదు సంవత్సరాలుగా సంపాదించుకున్న పరువు మొత్తం భూస్థాపితం అయిపోయింది. నా హెయిర్, నైల్, బ్లడ్ అన్ని కూడా టెస్ట్ లు చేయించుకున్నాను. పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. నా మాటలని నమ్మమని చెప్పడం లేదు. బహిరంగంగా ఎలాంటి టెస్ట్ లకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.