యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)అప్ కమింగ్ మూవీ దేవర(దేవర)వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది. ఆర్ఆర్ఆర్ వచ్చిన రెండున్నర ఏళ్ళకి వస్త అద్భుతమైన అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. హార్ట్ కోర్ ఫ్యాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. సెప్టెంబర్ 27 క్షణం ఒక యుగంలా గడుపుతున్నారు. ఇక తాజాగా ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మక సినీ సర్వే సంస్థగా పేరొందిన ఒక కంపెనీ దేవర రేంజ్ ని చెప్తుంది. ఆ విషయం ఏంటో చూద్దాం.
ఆర్మాక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్.. ముంబై కేంద్రంగా ఉండే ఈ సంస్థ 2008లో ఎస్టాబ్లిష్ అయ్యింది. అందులోని ఒక విభాగం ఆర్మాక్స్ సినిమాటిక్స్(ormax cinematix).కేవలం సినిమాకి మంచి ఉద్దేశ్యంతో పాటు సినిమాకి ప్రజల మధ్య వారధిగా ఏర్పడింది.సినిమాకి పబ్లిసిటీ చేయడంతో పాటుగా ఎనీ లాంగ్వేజ్ సినిమాకి బిజినెస్ విషయంలో కూడా హెల్ప్ చేస్తుంది. పివీఆర్, హోంబలే,రెడ్ చిల్లీస్, రిలయన్స్, యష్ రాజ్ ఫిలిమ్స్, జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ ఇలా సుమారు 100 దాకా ప్రొడక్షన్ కంపెనీ లు ఆర్మాక్స్ క్లయింట్స్ గా ఉన్నాయి. ఇలాంటి ప్రతిష్టాత్మక కంపెనీ టాలీవుడ్‌లో రాబోయే కొన్ని క్రేజీ ప్రాజెక్టులపై సర్వే నిర్వహించింది. ఇందులో దేవర టాప్ ప్లేస్‌లో ఉంది. టాలీవుడ్‌లోనే ది మోస్ట్ అవైటెడ్ మూవీగా దేవర నిలిచినట్లు ఆర్మాక్స్ వెల్లడి చేసింది. అంటే ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఎక్కువ మంది దేవర ని చూడటానికి వెయిట్ చేస్తున్నారు. తర్వాతి స్థానాల్లో పుష్ప-2, ఓజి, జై హనుమాన్, స్పిరిట్ నిలిచాయి.
దీంతో ఎన్టీఆర్ స్టామినా ఏ పాటిదో మరో సారి అర్ధమయ్యింది. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగానే ఇటీవల ఎన్టీఆర్,జాన్వీ మీద వచ్చిన రొమాంటిక్ సాంగ్ ఒక రేంజ్ లో సంచలనం సృష్టిస్తుంది. బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడైన సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు. ఆచార్య పరాజయంతో కొరటాల శివ ఎంతో ప్రెస్టేజియస్ గా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. అనిరుద్ సంగీత దర్శకుడు కాగా కళ్యాణ్ రామ్, హరి, సుధాకర్ మిక్కిలినేని నిర్మాతలు. రెండు భాగాలుగా దేవర తెరకెక్కుతున్న విషయం.