ఒకే ఒక్క సినిమా..కేవలం ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించే అదృష్టం ఏ కొద్దీ మంది హీరోలకో వస్తుంది. అలాంటి వాళ్ళల్లో ఒకడు రిషబ్ శెట్టి(rishab shetty)కాంతార(kantara)తో రిషబ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పవర్ ఫుల్ నటనతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా ప్రకటించిందంటే రిషబ్ రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా బాలీవుడ్ సినీ పరిశ్రమపై కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అవి హాట్ టాపిక్ గా మారాయి.
రిషబ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడటం మన భారతదేశాన్ని కొన్ని సినిమాలు తక్కువ చేసి చూపిస్తున్నాయి. అలా చూపించడంలో బాలీవుడ్ సినీ పరిశ్రమ ముందుంది. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో అర్ధం కావడం లేదు. మన సినిమాలకి ఇప్పుడు అంతర్జాతీయంగా గౌరవం లభిస్తుంది. మన సంస్కృతి, సంప్రదాయాలకు రెడ్ కార్పెట్ వేస్తున్నాం కాబట్టే మన సినిమాలకు ఇతర దేశాల్లో మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. అదే విధంగా మన దేశం గర్వపడేలా సినిమాలు చేయాలనుకుంటున్నానని కూడా తెలిపాడు.
ఇక బాలీవుడ్ కి చెందిన ప్రముఖులు, విమర్శకులు రిషబ్ మాటలపై మండి పడుతున్నారు. బాలీవుడ్ సినిమాల గురించి రిషబ్ అలా మాట్లాడటం సరికాదని, కాంతార ని బాలీవుడ్ కూడా ఆదరించిందనే విషయాన్నీ మర్చిపోకూడదని అంటున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ హీరో అర్షద్ వార్సి కల్కి సినిమా గురించి ప్రస్తావిస్తు ప్రభాస్(ప్రభాస్)పై కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా ప్రముఖులు అందుకు తగ్గ కౌంటర్ కూడా ఇచ్చారనుకోండి. ఈ నేపథ్యంలో రిషబ్ వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ రిషబ్ మాటలకి సంతోషంగా ఉన్నారు.