జూన్ 27న ప్రభాస్(ప్రభాస్)పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడి(కల్కి 2898 యాడ్)విడుదలై వరల్డ్ వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరకి తెలిసిన విషయమే. కల్కి హంగామా థియేటర్‌లో కొనసాగుతున్నంత సేపు వేరే సినిమాలు ఆ వైపు చూడటానికి కూడా సాహసం చేయలేదు. అంతలా కల్కి మానియా సాగింది. అంతే కాదు ఆ మానియా ఇప్పట్లో ఆగదని తాజా సంఘటన ఒకటి చెప్తుంది.
ఓటిటి వేదికగా కల్కి ఈ రోజు హిందీ లాంగ్వేజ్ కి సంబంధించి నెట్ ఫ్లిక్స్(netflix)లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అలాగే అమెజాన్ ప్రైమ్(amazon Prime)వీడియో ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు ఇండియన్ సినీ ప్రేక్షకులు మొత్తం కల్కిని వీక్షిస్తున్నారు. దీనితో కల్కి హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. దీంతో చిరంజీవి పుట్టిన రోజు కి ప్రభాస్ మంచి గిఫ్ట్ ఇచ్చినట్టయ్యిందంటూ ఇరువురు ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చిరు ప్రభాస్ లు కూడా ఒకరికొకరు చాలా ఆప్యాయంగా ఉంటారని తెలిసిన విషయమే. ప్రభాస్ తో పాటుగా అమితాబ్, కమల్, దీపికా పదుకునే కారణంగా కల్కి కి స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది.