జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ (రవితేజ). ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’తో ప్రేక్షకులను పలకరించిన రవితేజ.. ప్రస్తుతం ‘సామజవరగమన’ రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో తన 75వ సినిమా (RT75) చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో రవితేజ గాయపడ్డాడు.
RT75 చిత్రీకరణలో రవితేజ కుడి చేతికి గాయమైంది. అయినా గాయాన్ని, నొప్పిని లెక్క చేయకుండా.. షూటింగ్ ని కంటిన్యూ చేయడంతో అది తీవ్రమైందట. కుడిచేతి గాయం ఎక్కువ కావడంతో ఆయనను యశోద ఆసుపత్రిలో చేర్చగా.. సర్జరీ చేసిన వైద్యులు, ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. డాక్టర్ల బ్రేక్ సూచన.. పూర్తిగా రికవర్ అయ్యేవరకు సినిమా షూటింగ్ లకి ఇచ్చి, విశ్రాంతి తీసుకోవాలని రవితేజ నిర్ణయించుకున్నట్లు సమాచారం.