నవ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)ప్రెజంట్ తండేల్(thandel)షూటింగ్ లో ప్రస్తుతం ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టు పక్కల షూటింగ్ జరుపుకుంటుంది. హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మిస్తుండడంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి.పైగా చై కెరీర్ లోనే ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జట్ తో నిర్మాణం జరుపుకుంటుంది. రిలీజ్ కూడా ఈ సంవత్సరమే ఉండబోతుంది. ఈ మూవీ గురించి వచ్చే విషయాల్లో టాక్ అఫ్ ది డే గా నిలిచింది తాజాగా మరో విషయంలో టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
ఐఆర్ఎఫ్(irf)ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్. రెప్పపాటులో కార్లు దూసుకెళ్తుంటే చూడటానికి రెండు కళ్ళు కూడా చాలవు. ఆగస్ట్ 24న చెన్నై వేదికగా పోటీలు జరగబోతున్నాయి. ఇందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ కూడా పాల్గొంటుంది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ ని చై కొనుగోలు చేసాడు. అంటే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ కి చై నే ఓనర్.అందుకు సంబంధించిన యాడ్ ని కూడా చై పూర్తి చేసాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లోనే వ్యూయర్స్ ని సంపాదిస్తుంది. పైగా దీనితో తనకి కారు రేసింగ్ అండ్ ఫార్ములా 1 పోటీలంటే ఎంత ఇష్టమో చై మరోసారి చాటి చెప్పింది. ఇంకో ఆరు టీం లు కూడా పోటీలో పాల్గొనబోతున్నాయి. బాలీవుడ్ హీరోలు అర్జున్ కపూర్, జాన్ అబ్రహంతో పాటు ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ గంగూలీ(గంగూలీ) కూడా ఐఆర్ఎఫ్ టీమ్స్ కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు .ఇండియా వైడ్ గా మాత్రమే పోటీలు జరుగుతాయి.
ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వస్త అభిమానులు చై కి కంగ్రాట్స్ చెప్తున్నారు. అదే విధంగా హైదరాబాద్ టీం గెలవాలని కామెంట్లు కూడా చేస్తున్నారు. కొంత మంది అయితే ఇటీవలే శోభిత తో ఎంగేజ్మెంట్ అయ్యింది కదా ఆమె వేళా విశేషం ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ కి ఓనర్ అయ్యాడనే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. చెప్పారు.