బిగ్ 7 కంటెస్టెంట్ గౌతమ్‌కృష్ణ హీరోగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్‌పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి.నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సోలో బాయ్’. జుడా షాండి మ్యూజిక్ ఆఫర్ ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్‌గా నటించారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ నేడు ఘనంగా లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాట్లాడుతూ : గౌతం డాన్స్ ఇరగదీసాడు. కచ్చితంగా ఫ్యూచర్‌లో పెద్ద హీరో అవుతాడు. సోలో బాయ్ టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ చాలెంజ్ చేసిన వాళ్లకి మొదటి బహుమతిగా 30,000 రెండవ బహుమతిగా 20,000 మూడో బహుమతిగా 10,000 ఇవ్వబడుతుంది.
డైరెక్టర్ పి.నవీన్‌కుమార్ మాట్లాడుతూ : మా హీరో గౌతమ్ కృష్ణ చాలా బాగా నటించాడు. సాంగ్స్ ఫైట్స్ ఎమోషనల్ సీన్స్ అన్నిటిలోనూ తనదైన శైలితో నటించాడు. సోలో బాయ్ టైటిల్ సాంగ్‌లో డాన్స్ బాగా చేశాడు అన్నారు.
ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మాట్లాడుతూ: ఈ సినిమా కోసం మాకు సపోర్ట్ చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్‌కి టెక్నీషియన్‌కి కృతజ్ఞతలు. సోలో బాయ్ సాంగ్ చూసిన అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ : హుక్ స్టెప్ చాలెంజ్ చేసి మమ్మల్ని, టీం ని ట్యాగ్ చేసి పోస్ట్ చేసిన వాళ్ళ నుంచి బెస్ట్ సెలెక్ట్ చేసి మీడియా ముందే బహుమతిని అందజేస్తాం. టైటిల్ సాంగ్ కాసర్ల శ్యామ్ గారు రాశారు రాహుల్ సిప్లిగంజ్ అన్న పాట అద్భుతంగా పాడాడు.