సోషల్ మీడియా బాగా విస్తరించిన ప్రస్తుత సమయంలో ఏ చిన్న విషయం జరిగినా దాన్ని తెరపైకి తెచ్చి నలుగురికీ షేర్ చేస్తున్నారు. వారు తాము పెట్టిన కంటెంట్‌కి వ్యూస్‌గానీ, కామెంట్స్‌గానీ వస్తాయన్న ఉద్దేశ్యం కావచ్చు, ఫాలోవర్స్‌ని పెంచుకునే ఆలోచన కావచ్చు. సెలబ్రిటీల్లో ఈ పోకడ ఎక్కువగా ప్రారంభమైంది. ముఖ్యంగా ఫేడ్ ఔట్ అయిపోయిన నటినటులు లేదా చిన్న స్థాయి ఆర్టిస్టులు ఇలాంటి జిమ్మిక్స్‌లు చేస్తుంటారు. అయితే జరిగింది వాస్తవమే అయినా దాన్ని భూతద్దంలో చూపించి మనల్ని అలర్ట్ చేసే ప్రయత్నం మరీ చేస్తారు. అలాంటి ఓ ఘటన గురించి నటి నమిత సోషల్ మీడియాలో అందరితో షేర్ చేసుకుంది.
2002లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘సొంతం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన నమిత ఆ కొన్ని సినిమాల్లో నటించిన నటిగా అంత గుర్తింపు రాలేదు. దీనితో తన రూటు మార్చుకొని కుర్రకారుని రెచ్చగొట్టే వ్యాంప్ తరహా పాత్రల్లో నటించింది. ఆ క్యారెక్టర్స్ ఆమెకు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘సింహా’లోని క్యారెక్టర్‌కి మంచి పేరు వచ్చింది. తెలుగులోనే కాదు, తమిళ్‌తోపాటు ఇతర భాషా చిత్రాల్లోనూ నటించిన నమిత 2017లో పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుంది.
సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా ఫ్యామిలీతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లింది నమిత. అయితే అక్కడ ఆమెకు ఓ ఊహించని ఘటన జరిగింది. నమితను అక్కడి అధికారులు ఆలయంలోకి అనుమతించలేదు. అంతేకాదు, తన సర్టిఫికెట్స్ చూపించాల్సిందిగా. దీనికి షాక్ అయిన నమిత వెంటనే సోషల్ మీడియాను ఆశ్రయించి తనకు జరిగిన అవమానాన్ని అందరితోనూ పంచుకుంది. తమిళనాడులోనే కాకుండా దేశంలో ఉన్న ఎన్నో దేవాలయాలకు తాను అని, ఎక్కడా ఇలా జరగలేదని వాపోయింది. అంతేకాదు, ఆలయ అధికారులు కూడా తనపట్ల అమర్యాదగా మాట్లాడారంటూ ఓ పోస్ట్ పెట్టారు.
నమిత పోస్ట్ పెట్టింది కాబట్టి నిమిషాల్లో అది వైరల్‌గా మారిపోయింది. ఇది సిబ్బంది ఆలయ దృష్టికి కూడా వెళ్లింది. సోషల్ మీడియాలో నమిత చేసిన కామెంట్స్‌పై ఆలయ అధికారులు స్పందించారు.. ఆమెతో అధికారులెవరూ అమర్యాదగా మాట్లాడలేదని, ఆలయ నిబంధనల ప్రకారం మాట్లాడామని చెప్పారు. పై అధికారులు చెప్పడం వల్లే ఆమెను కొంతసేపు ఆపి, ఆ తర్వాత ఆలయంలోకి అనుమతిస్తాము. వాస్తవానికి ఇది సోషల్ మీడియాలో రచ్చ చేసేంత విషయం కాదు అనేది అర్థమవుతూనే ఉంది. అధికారులు రెగ్యులర్‌గా చేసే పనుల్లో భాగంగానే ఇది జరుగుతుంది. కాకపోతే నమిత అత్యుత్సాహంతో పెట్టిన పోస్ట్ నెటిజన్లకు పని కల్పించింది.