యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా చర్యల నేపథ్యంలో ఆయన అభిమానులు కొంచం నిరుత్సాహ పడిన విషయం తెలిసిందే. ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేశారనేది కూడా అభిమానుల ఆరోపణ. ఇక ఆ పక్కన ఉంచితే నాగ్ అభిమానుల డల్ నెస్ పోగొట్టడానికి కుబేర టీం తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించింది.
నాగ్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ కుబేర. తమిళ అగ్ర హీరోల్లో ఒక ధనుష్ కూడా మరో హీరోగా స్క్రీన్ మీద మెరవన అద్భుతమైన అంచనాలు ఒక రేంజ్ లోనే ఉన్నాయి. రీసెంట్ గా కుబేర లో ముఖ్య పాత్ర పోషిస్తున్న జిమ్ సర్బ్ ఫస్ట్ ని మేకర్స్ విడుదల చేసారు. జిమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన నోట్ల కట్ట మధ్య స్టైల్‌గా నిల్చున్న జిమ్ పోస్టర్ ఇప్పుడు సినిమాపై మరింత ఆసక్తిని అటు అభిమానులతో పాటు ప్రేక్షకులను కలిగిస్తుంది. కాకుండా జిమ్ క్యారక్టర్ అంటే ఎలా వుండబోతుందనే చర్చ కూడా సోషల్ మీడియా
వేదికగా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం విడుదలైన నాగ్ ఫస్ట్ లుక్ కూడా ఒక రేంజ్ లో అదిరిపోయింది. కట్టల కట్టల గా డబ్బులు ఉన్న ఒక పెద్ద కంటర్ ముందు నాగార్జున గొడుగు వేసుకొని ఉంటాడు.
ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లబోతుంటే ఇంకో నోటు కనపడుతుంది. కానీ దాన్ని ముట్టుకోకుండా తన పర్సులో ఉన్న ఇంకో నోటు తీసి లోపల డబ్బుల్లో ఉంచుతాడు. దీంతో నాగ్ కి డబ్బులు అవసరం లేదని తెలుస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన జిమ్ లుక్ మాత్రం పిచ్చి ఉన్నోడుగా ఉంది.దీంతో నాగ్, జిమ్ కి మధ్య డబ్బు గురించి వార్ ఎలా ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇక ముందు విడుదలైన ధనుష్ లుక్ కూడా ఒక రేంజ్ లోనే ఉంది. ఇక కుబేర లో రష్మిక హీరోయిన్ గా చేస్తుండగా శేఖర్ కమ్ముల దర్శకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావులు సంయుక్తంగా చేశారు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది.