తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు నటించే సంప్రదాయాన్ని మనం పాత సినిమాల్లోనే చూస్తాం. ఆ తర్వాతికాలంలో తెలుగు నటిమణులు కరువయ్యారు. 90వ దశకం నుంచి పరభాషా హీరోయిన్ల దిగుమతి బాగా పెరిగిపోయింది. ఆ సమయంలోనే అచ్చ తెలుగు అమ్మాయి లయ సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఏడేళ్ళ వయసులోనే చదరంగంలో ప్రావీణ్యం సంపాదించిన లయ ఆ తర్వాత ఏడు సార్లు రాష్ట్రస్థాయిలో, రెండు సార్లు జాతీయ స్థాయిలో పతకాలు సొంతం చేసుకున్నారు. హైస్కూల్ చదువు పూర్తయ్యే వరకు చదరంగం పోటీల్లో పాల్గొనే వారు. 1992లో నాలుగేళ్ళ వయసులోనే భద్రం కొడుకో చిత్రంలో నటించిన లయ ఆ తర్వాత 1999లో వచ్చిన స్వయంవరం చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే స్వయంవరం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో వరస అవకాశాలు వచ్చాయి. లయ చేసిన ప్రతి సినిమా కుటుంబసమేతంగా చూసేదిగా ఉండేది. ఎక్కడా అశ్లీలతకు తావులేని క్యారెక్టర్లు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించారు. ప్రేమించు పాత్రగాను ఉత్తమనటిగా నంది అవార్డు అందుకున్నారు.
2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీగణేష్‌ను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి సినిమాలు బాగా తగ్గించారు. 2018 వరకు రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే లయ కుమార్తె శ్లోకను కూడా హీరోయిన్‌గా చెయ్యాలన్నది ఆమె కోరిక అని. అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో చిన్నప్పటి ఇలియానాగా శ్లోక నటించింది. ఇప్పుడు శ్లోక హీరోయిన్ స్థాయికి ఎదిగింది. లయ కూడా ఒకప్పటి ఫిజిక్‌నే మెయిన్‌టెయిన్ చేస్తూ స్లిమ్‌గా ఉన్నారు. ఈ ఇద్దరూ తల్లీకూతుళ్లలా కాకుండా అక్కాచెల్లెళ్లలా కనిపిస్తున్నారని ఫోటోలు చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీరి ఫ్యామిలీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తల్లిని మించిన అందంతో ఉన్న శ్లోక త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక స్టార్ హీరో తనయుడి సినిమాతో శ్లోక హీరోయిన్‌గా పరిచయం కాబోతోందని సమాచారం.
ఇక లయ సెకండ్ ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే.. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాతో లయ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే శివాజీతో కలిసి ఓ సినిమాలో నటించబోతోంది. వీరిద్దరిదీ హిట్ పెయిర్‌గా అప్పట్లో మంచి పేరు ఉంది. మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి సినిమాల్లో ఈ జంట అందర్నీ ఆకట్టుకుంది. తరగని అందంతో తిరిగి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న లయ సెకండ్‌లో కూడా నటిగా బిజీ అవుతుందని అందరూ అన్నారు.