పోకిరి లో మహేష్ బాబు (మహేష్ బాబు)చెప్పిన “ఎప్పుడొచ్చామని కాదన్నాయ్, బుల్లెట్ దిగింది లేదా అనే డైలాగ్ కి తగ్గట్టుగా మెగాస్టార్ చిరంజీవి(చిరంజీవి)కి సంబంధించిన న్యూస్ ఒకటి ఎప్పుడొచ్చామన్నది కాదు, వైరల్ అయ్యామా లేదా అని చెప్తుంది.ఇంతకీ ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
లేటెస్ట్ గా విశ్వ విఖ్యాత నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ సోదరుడు కైకాల నాగేశ్వరరావు(kaikala nageswara rao)రమ ఫిలింస్ పైనే కాకుండా ఇతరుల భాగస్వామ్యం లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు,చిరంజీవి, బాలకృష్ణ లతో పలు సినిమాలని నిర్మించారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి హీరోగా చిరంజీవి అనే సినిమాని నిర్మించాం. నిజానికి చిరంజీవి గారితో ప్లాన్ చేయలేదు. చిరంజీవి మూవీకి ఒరిజినల్ వెర్షన్ కన్నడంలో వచ్చిన నేనే రాజా.. కొత్త హీరోతో ఐతే బాగుంటుందని అనుకోకుండా తగ్గ ప్రయత్నాల్లో ఉన్నాం. హీరో తప్పుల మీద తప్పు చేసి చనిపోతాడు. తప్పని పరిస్థితుల్లో తప్పులు చేసి చనిపోతాడు కొద్దిగా నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి.అందుకే కొత్త హీరో ని ఫిక్స్ అయ్యాం. కానీ చిరంజీవి పట్టు బట్టి చేసాడు. మీరు నెగిటివ్ రోల్ కి సెట్ అవ్వరు. హీరోగా మంచి ఎస్టాబ్లిష్ అవుతున్నారని కూడా చెప్పాం. కానీ చిరు వినలేదు. ఆ పాత్ర మీద ఇష్టంతో చేసారు. కానీ సినిమా ప్లాప్ అయ్యింది. ఈ విషయం చిరంజీవి గారికి కూడా తెలుసునని చెప్పుకొచ్చాడు.
ఇక ఆయన చెప్పినట్టుగానే 1985 ఏప్రిల్ 18 విడుదలైన చిరంజీవి మూవీ పరాజయాన్ని మూటగట్టుకుంది. చిరు సరసన విజయశాంతి జత గట్టగా భానుప్రియ, మురళి మోహన్, సత్యనారాయణ, రంగనాధ్ ముఖ్య పాత్రల్లో చేసారు.సి వి రాజేందరన్ దర్శకుడు.