టాలీవుడ్ యంగ్ స్టార్స్ లో న్యాచురల్ స్టార్ నాని (నాని)కి మినిమం గ్యారెంటీ హీరోగా పేరు వచ్చింది. ఆయన నటించిన మెజారిటీ సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందుతుంటాయి. అందుకే నాని సినిమాలు మంచి బిజినెస్ చేయడమే కాకుండా, మంచి వసూళ్లను రాబడుతుంటాయి. నాని తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) కూడా అదిరిపోయే థియేట్రికల్ బిజినెస్ చేసింది.
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సరిపోదా శనివారం’. ఆగస్టు 29న విడుదలవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే రూ.41 కోట్ల భారీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
నైజాంలో రూ.12.50 కోట్లు, ఆంధ్రాలో రూ.12.50 కోట్లు, సీడెడ్‌లో రూ.5 కోట్లు బిజినెస్ చేసిన ‘సరిపోదా శనివారం’.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి రూ.30 కోట్ల బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా రూ.5 కోట్లు, ఓవర్సీస్ రూ.6 కోట్లు కలిపితే.. వరల్డ్ వైడ్ గా రూ.41 కోట్ల బిజినెస్ చేసింది. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.41 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు, అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. పాజిటివ్ టాక్ వస్తే ఇది పెద్ద టార్గెట్ కాదనే చెప్పాలి.
థియేట్రికల్ బిజినెస్ పరంగా నాని కెరీర్‌లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా ‘దసరా’ తర్వాత స్థానంలో ‘సరిపోదా శనివారం’ నిలిచింది. రూ.50 కోట్ల బిజినెస్ చేసిన ‘దస’.. రూ.6 కోట్ల షేర్ రాబట్టి విజయం సాధించింది. ఇప్పటిదాకా టైర్-2 హీరోలలో రూ.40 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసి హిట్ కొట్టిన హీరో నానినే. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’తో మరోసారి ఆ ఫీట్ సాధిస్తాడేమో చూడాలి.