భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని నటి కుట్టి పద్మిని(kutty padmini)తెలుగు,తమిళ,కన్నడ,హిందీ భాషల్లో సుమారుగా ఎనభై చిత్రాల వరకు చేసింది. అదే విధంగా అరవై సీరియల్స్ వరకు నిర్మించడం తో పాటు కొన్నింటికి దర్శకత్వం కూడా వహించింది.మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా నటిమణులపై అభియోగాలు జరుగుతున్నాయని హేమ కమిటీ నిర్దారించిన వేళ కుట్టి పద్మిని చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తెరమీదకి వస్తున్నాయి.
ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కుట్టి పద్మిని మాట్లాడుతు తమిళ టివి ఇండస్ట్రీ నటిమణులకి సైతం వీరిలో వేధింపులు తప్పడం లేదు. పని ప్రదేశాల్లో వారికి రక్షణ కరువయ్యింది. డాక్టర్ లాయర్ మాదిరిగానే నటి నటులుగా రాణించడం ఒక ప్రొఫెషన్.ఈ రంగంలోని మహిళలు ఎంతో మంది వల్ల వేధింపులకి గురవ్వుతున్నారు.ఇది నిజంగా బాధాకరం అని చెప్పడమే కాకుండా సంచలన విషయాలని చెప్పుకొచ్చింది. దర్శకులు, టెక్నీషియన్లు తమ ఫేవర్స్ తీర్చమని నటిమణులని అడుగుతుంటారు.దాంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక తమలో తామే బాధపడుతుంటారు. ఎందుకంటే ఫిర్యాదు చేసినా కూడా నిరూపితం కాదు. వారి చేష్టలు సహించిన వారు మాత్రమే ఇక్కడ రాణించగలరు. కాకుండా కొంత మంది నటిమణులు ఆత్మహత్య యత్నానికి కూడా హాజరయ్యారు.అందుకే వారి సంరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని సూచించారు.ఇప్పుడు ఈ విషయం ఇండియన్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక కుట్టి పద్మిని కి మద్దతుగా ప్రముఖ నటి సనమ్ శెట్టి కూడా దిగి తమిళ సీమలో నటిమణుల పై కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పింది. హీరో విశాల్(విశాల్)కూడా మాట్లాడుతు త్వరలోనే ఒక కమిటీ ని వేసే ఆలోచనలో ఉన్నామని చెప్పాడు. మొత్తం పది మంది సభ్యులు అందులో ఉంటారని కూడా ఆయన చెప్పారు.