‘పుష్ప’ చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ ఏ రేంజ్‌కి వెళ్లిందో అందరికీ తెలిసిందే. సుకుమార్‌తో కలిసి బన్నీ చేసిన ఈ మ్యాజిక్‌కి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రస్టిక్‌గా, పూర్తి మాస్ క్యారెక్టర్‌లో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్‌కి జేజేలు పలికారు. ‘పుష్ప’ అతని నటనా ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటుడు అవార్డుతో సత్కరించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అందుకున్న తొలి హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. 2021లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఓ ప్రభంజనం సృష్టించింది. మ్యూజికల్‌గా కొన్ని రికార్డులను కూడా క్రియేట్ చేసింది. అరుదుగా వచ్చే ఇలాంటి సినిమాలను ఆదరించడంలో ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు.
అందుకే పుష్ప రెండు భాగాలుగా విడుదల చేయబడ్డ మేకర్స్ భావించారు. 2021లో పుష్ప చిత్రం విడుదలైంది. దానికి కొనసాగింపుగా పుష్ప2 మరింత వైవిధ్యంగా ప్రదర్శించే విషయంలో దర్శకుడు సుకుమార్ అనుసరిస్తున్న తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సెప్టెంబర్ 3 నుంచి అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్‌లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు సుకుమార్. డిసెంబర్ 6న ‘పుష్ప2’ 13 భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. పుష్ప సాధించిన ఘనవిజయంతో పుష్ప2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో హీరో, దర్శకుడు, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
‘పుష్ప2’ చిత్రం ఎంత క్రేజ్‌లో ఉంది అనే విషయాన్ని తాజాగా ఓ విషయం ప్రూవ్ చేసింది. స్టార్ హీరోల సినిమాలకు థియేట్రికల్ రైట్స్‌కి ఎంత పోటీ ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడది ఓటీటీలో కూడా మొదలైంది. ‘పుష్ప2’ చిత్రం కోసం ప్రపంచమే ఎదురుచూస్తోందన్న విషయాన్ని గమనించిన ఓటీ సంస్థలు ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. అయితే ఒక పక్కన పెట్టి నెట్‌ఫ్లిక్స్ సంస్థ ‘పుష్ప2’ ఓటీటీ రైట్స్‌ని ఏకంగా రూ.270 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలో ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ ఓటీటీ రైట్స్ ఇంత భారీ మొత్తంలో అమ్ముడు కాలేదు. దీన్ని బట్టి ‘పుష్ప2’ చిత్రం ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓటీటీ రైట్స్ ఇంత భారీ మొత్తంలో సెల్ అవ్వడం ద్వారా ‘పుష్ప2’ తొలి ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఓటీటీ రైట్స్ విషయంలో కొత్త రికార్డు సృష్టించిన ‘పుష్ప2’ ప్రపంచవ్యాప్తంగా 13 భాషల్లో విడుదల సంస్థ. మరి థియేట్రికల్‌గా ‘పుష్ప2’ కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో, ఎలాంటి రికార్డులు నమోదవుతాయో చూడాలి.