తెలుగు చిత్ర పరిశ్రమతో సమంత(samantha)కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 2010 లో వచ్చిన ఏ మాయ చేసావే తో సాగిన సినీ ప్రస్థానం బాలీవుడ్ వరకు వెళ్లిందంటే సామ్ నట స్టామినా ని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా నటిమణులపై దాడులు జరుగుతున్నాయని నిర్దారించిన హేమ కమిటీని అభినందించిన సామ్ ఇప్పుడు సరికొత్త డిమాండ్ ని తెర మీదకి తీసుకొచ్చింది.
కేరళ ప్రభుత్వం హేమ కమిటీని ఏర్పాటు చేసింది, తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా వేధింపులపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికీ విజ్ఞప్తి చేసింది. అదే విధంగా హేమ కమిటీ ఏర్పాటుకి కారణమైన డబ్య్లుసిసి లాగే టాలీవుడ్ లో కూడా సపోర్ట్ గ్రూప్ ది వాయిస్ ఆఫ్ ఉమెన్ నడవాలి. దీనివల్ల సురక్షితమైన వాతావరణంలో మహిళలు పనిచేసేందుకు అవకాశం దొరుకుతుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపాటుకి సిద్ధమైంది. కమిటీని నియమిస్తే మహిళా నటిమణులపై జరుగుతున్న ఎన్నో సంఘటనలు బయటకు వస్తాయని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)ఇటీవల కాలంలో సినీ పరిశ్రమపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు.సినిమా ప్రదర్శనకు ముందు అందులో నటించిన నటుల చేత మత్తు పదార్ధాలు వాడటం నేరమని చెప్పించానే రూల్ ని ప్రవేశ పెట్టారు. మరి సామ్ డిమాండ్ ని కూడా పరిగణలోకి తీసుకొని కమిటీని ఏర్పాటు చేస్తారేమో చూడాలి. ఏది ఏమైనా సమంత డిమాండ్ తో రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం మీద సినీ ప్రముఖుల్లోనే కాదు, సినీ ప్రేమికుల్లో కూడా క్యూరియాసిటీ నెలకొని ఉంది.