మార్తాండ్ కె వెంకటేష్(marthand k venkatesh)తెలుగు చలన చిత్ర సీమలో ఈ పేరుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది.వెంకటేష్ ఒక సినిమాని ఎడిట్ చేసాడంటే ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అనే నానుడి కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.1994 లో వచ్చిన అల్లరి ప్రేమికుడుతో మొదలుపెట్టి నేటికీ టాప్ ఎడిటర్ గా కొనసాగుతున్నారు. . అదే విధంగా రిలీజ్ కి ముందే సినిమా హిట్టా ఫట్టా అని కూడా చెప్పటంలో ఘనాపాటి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి.
వెంకటేష్ మాట్లాడుతూ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(allu aravind)గారు డాడీ సినిమా చేసే టైంలో నీకు చిరంజీవి(chiranjeevi)గారంటే ఇష్టమా అని అడిగాడు. నేను వెంటనే అదేంటి సార్ అలా అడుగుతున్నారంటని అడిగాను. ఏం లేదు ఎడిటర్ అనే వాడు ఎవర్ని ఇష్టపడకుండా క్రిటిక్ గా ఉండాలి. హీరోల మీద ఇష్టంపెంచుకుంటే సినిమా జడ్జిమెంట్ విషయంలో తప్పు చెప్పే అవకాశం ఉంది. సినిమా విషయంలో ఎవరైనా అబద్ధం ఆడవచ్చు.కానీ ఎడిటర్ లు ఆడకూడదు. ఉన్నది ఉన్నట్లు చెప్పాలని చెప్పాడు.
లెజండరీ ఎడిటర్ కే ఏ మార్తాండ్ వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ ఇప్పటి వరకు సుమారు 400 చిత్రాల వరకు పని చేసారు. నైన్టీ పర్సంట్ సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకుపోతున్నాడు.