తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఎందరో నిరాశ్రయులు అయ్యారు. నుండి ప్రాణాలు కోల్పోయారు. ఈ కష్ట సమయంలో తెలుగు ప్రజలకు అండగా ఉండటానికి ఎప్పటిలాగే తెలుగు సినీ పరిశ్రమ కదిలి వస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, త్రివిక్రమ్, వైజయంతి మూవీస్, హారిక & హాసిని క్రియేషన్స్ తమవంతుగా బాధితులను ఆదుకోవడానికి విరాళాలను ప్రకటించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ (నందమూరి బాలకృష్ణ) కూడా కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించారు.
“50 ఏళ్ల క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నాట ప్రస్థానం సాగుతూనే ఉంది, వెలుగుతూనే ఉంది. .నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.” అని బాలకృష్ణ ప్రకటనలో తెలిపారు.
కాగా, అబ్బాయి ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ కి రూ.50 లక్షలు, తెలంగాణకి రూ.50 లక్షలు చొప్పున కోటి ప్రకటించగా.. బాబాయ్ బాలకృష్ణ కూడా అదే బాటలో పయనిస్తూ కోటి రూపాయలు ప్రకటించడం విశేషం.