టాలీవుడ్‌లో మోస్ట్ ఎవైటింగ్ మూవీగా ఎన్టీఆర్, కొరటాల శివల ‘దేవర’ నిలుస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ సెప్టెంబర్ 27 ఫిక్స్ అయింది. ఐదు భాషల్లో ఈ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ కూడా దాదాపు పూర్తయింది. రూ.400 కోట్ల వరకు బిజినెస్ సమాచారం. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకి ఉన్న టాలీవుడ్ ప్రత్యేకత.. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇది సినిమాకి బాగా ప్లస్ అయ్యే అంశం. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది.
ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా కొన్ని రికార్డులను క్రాస్ చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాల్లో ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా వసూళ్ళు రాబట్టింది. ఈ సినిమా ఫున్ రన్‌లో రూ.415 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత స్థానం బాహుబలి2 చిత్రానిది. ఈ చిత్రం రూ.330 కోట్లు కలెక్ట్ చేసింది. కల్కి 2898ఎడి రూ.296 కోట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక సలార్ రూ.234 కోట్లతో నాలుగో నిధులను ఆక్రమించింది. ఐదో అల స్థానంలో వైకుంఠపురం ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర టాప్ 5లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం స్టార్ హీరోల సినిమాలు రన్ అయిన రోజుల ప్రకారం కాకుండా కలెక్ట్ చేసిన డబ్బును బట్టి ఆ సినిమా రేంజ్‌ని లెక్కిస్తున్నారు. సినిమాపై ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని లెక్కకు మించిన థియేటర్‌లలో సినిమాని రిలీజ్ చేయడం ద్వారా తమ టార్గెట్‌ని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం, ఆల్రెడీ కలెక్షన్స్‌లో ఆ సినిమా మొదటి స్థానంలో ఉండటం వల్లే ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవర టాప్ 5లోకి ఎంటర్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. మొదటి రెండు స్థానాలకు ఈ సినిమా చేరే అవకాశం లేదు. కాబట్టి మూడో స్థానంలో ఉన్న కల్కి చిత్రాన్నే ఎక్కువ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. టాప్ 10లో ఉన్న మిగిలిన సినిమాల కలెక్షన్స్‌ని చూస్తే వాల్తేరు వీరయ్య రూ.186 కోట్లు, సరిలేరు నీకెవ్వరు రూ.177 కోట్లు, బాహుబలి రూ.176 కోట్లు, సైరా రూ.168 కోట్లు, రంగస్థలం రూ.160 కోట్ల కలెక్షన్లు సాధించి వరసలో ఉన్నాయి.
దేవర సినిమాకి సంబంధించి జరిగిన బిజినెస్, సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్‌ని లెక్కలోకి తీసుకొని టాప్ 5లోకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన కథాంశంతో దేవర రూపొందించబడింది. అలాగే కొరటాల శివ కెరీర్‌లో కూడా ఇలాంటి జోనర్‌లో సినిమా చేయలేదు. ఈ రెండు అంశాలు సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు బాగా పెరుగుతున్నాయి. దేవర రిలీజ్ టైంకి పోటీగా ఏ స్టార్ హీరో సినిమా లేదు. కాబట్టి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నెంబర్స్‌ని దేవర డెఫినెట్‌గా రీచ్ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు మేకర్స్.