విజయ్ దేవరకొండ(vijay devarakonda)పూరి జగన్నాధ్(puri jagannadh)కాంబోలో 2022 లో వచ్చిన లైగర్(liger)ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ అనన్య పాండే. హిందీ చిత్రసీమలో సుమారు వందకి పైగా చిత్రాలు చేసిన స్టార్ యాక్టర్ చుంకీ పాండే కూతురే అనన్య పాండే. మహిళల మీద జరుగుతున్న అఘాయాత్యాల గురించి కొన్ని సూచనలను తప్పకుండా పాటించాలని చెప్తుంది.
ఇప్పుడు మహిళలకు చీకటి కాలం ఉంటుంది.కాబట్టి సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం మీద మహిళలకి అవగాహన ఉండాలి. మన చుట్టూ ఉండే పరిసరాలను గమనించుకుంటూ ప్రతి వ్యక్తి పైన అవగాహనని పెంచుకోవాలి. అలాగే మహిళల మీద జరుగుతున్న దాడులను ఆపడం కోసం ఏం చెయ్యాలో ఆలోచించాలి. ఎందుకంటే ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను.నేను ఇలాంటి పరిస్థితులపై ఎప్పటి కప్పుడు చర్చిస్తూనే ఉన్నాను. వాస్తవానికి చట్టాలను మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది చాలా అవసరమైన నిర్ణయం కూడా. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కూడా తీసుకోవాలి. కాకపోతే ముందుగా ఇప్పుడు నటిమణులు వాళ్ళ సమస్యలని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు.
2019 లో సినీ రంగ ప్రవేశం చేసిన అనన్య ఇప్పటి వరకు పది సినిమాల వరకు చేసింది. రీసెంట్ గా వచ్చిన బాడ్ న్యూస్ లో స్పెషల్ అప్పియరెన్స్ క్యారక్టర్ లో మెరిసింది.ప్రజంట్ అక్షయ్ కుమార్ తో కలిసి శంకర అనే మూవీ చేస్తుండగా సిటిఆర్ఎల్ అనే మరో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.